Home » వ్యాపారం వ్యాప‌రమే త‌మ్ముడు త‌మ్ముడే… సురేష్ బాబు- వెంక‌టేష్!!

వ్యాపారం వ్యాప‌రమే త‌మ్ముడు త‌మ్ముడే… సురేష్ బాబు- వెంక‌టేష్!!

by Azhar
Published: Last Updated on
Ad

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ బ్యానర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన బ్యాన‌ర్ ఇది. నిర్మాత డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ ఎన్నో హిట్ సినిమాలను అందించింది. దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలను రూపొందించి ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ పతాకాల్లో ఒకటిగా నిలిచింది. రామానాయుడు మరణం తర్వాత ప్ర‌స్తుతం ఈ సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలకు ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు చూసుకుంటున్నారు. వ్యాపార విస్తరణ చేస్తూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు సురేష్ బాబు. 120కి పైగా సినిమాలను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.

Also Read: సింగర్ శ్రీరామ్ పై కుట్ర జరుగుతోందా…ఆ స్క్రీన్ షాట్ లను కావాలనే వైరల్ చేస్తున్నారా…?

Advertisement

ఇక ఈ బ్యానర్‌పై రీసెంట్‌గా వచ్చిన ‘వెంకీ మామ‘ మూవీ సూపర్ హిట్ అయింది. క‌రోనా కార‌ణంగా అన్ని ప‌రిశ్ర‌మ‌లపై ప‌డిన భారం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సినీ ప‌రిశ్ర‌మ‌యితే పెద్ద ప్రాజెక్టులు త‌ప్పించి చిన్న సినిమాల ప‌రిస్థితి మ‌రీ దారుణ‌మ‌యిపోయింది. దీంతో చిన్నా పెద్ద నిర్మాత‌లంద‌రూ కూడా దాదాపు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ పై మ‌క్కు చూపిస్తున్నారు. సురేష్‌బాబు కూడా తాను నిర్మించిన చిత్రాలు అమెజాన్‌, ప్రైమ్ వంటి ఓటీటీల్లో విడుద‌ల చేశారు. ఇటు బిజినెస్‌కి ఏమీ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అంటే కేవ‌లం స‌బ్‌స్రైబ‌ర్ల‌కి మాత్రమే ఆ చిత్రాలు రీచ్ అయ్యే అవ‌కాశం ఉంది. నార్మ‌ల్ పీపుల్‌కి ఆ సినిమాలు చూసే అవ‌కాశం ఉండ‌దు. అందులోనూ పెద్ద హీరోల చిత్రాలు అందులో విడుద‌ల‌వ్వ‌డం వ‌ల్ల ఒక‌ర‌కంగా చెప్పాలంటే న‌ష్ట‌మ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఆ ఎఫెక్ట్ మొత్తం హీరోపైన ఎక్కువ‌గా ప‌డుతుంది.

Advertisement

ఇటీవ‌లె ఈ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన నారప్ప, దృశ్యం 2, రానా న‌టించిన విరాట ప‌ర్వం ఇలా మూడు చిత్రాల వ‌ర‌కు సురేష్‌బాబు ఓటీటీకి అమ్మేసిన‌ట్లు తెలుస్తుంది. దాదాపు 100కోట్ల బిజినెస్ అయ్యింద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఒక ప్రొడ్యూస‌ర్ ప‌రంగా సురేష్‌బాబు ల‌బ్ధిపొందిన‌ప్ప‌టికీ థియేట‌ర్ ప‌రంగా వెంక‌టేష్ న‌ష్ట‌పోతున్నారు. మ‌రి దాంతో వెంకీ ఫ్యాన్స్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నార‌ప్ప విడుద‌లై సినిమా కూడా చాలా బావుంద‌నే టాక్ వినిపించింది. కానీ చాలా మందికి చూసే అవ‌కాశం దొర‌క‌లేదు. అదే చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌యితే పెద్ద హీరో కాబ‌ట్టి క‌చ్చితంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వచ్చేవారు. మ‌రి ఒక‌ర‌కంగా చూస్తే ఇక పై వ‌చ్చే సురేష్‌ప్రొడ‌క్ష‌న్ లో చిత్రాల‌న్నీ కూడా ఓటీటీకే వెళ‌తాయా అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఫ్యాన్స్ కూడా త‌మ్ముడి మీద ఇలాంటి ప్ర‌యోగాలేంట‌ని మండిప‌డుతున్నారు.

Also Read: శృతి హాస‌న్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదా? 12 ఏళ్ల ఆమె కెరీర్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే!

Visitors Are Also Reading