రాజీకీయాల్లో క్రీడారంగంలో, సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న వాళ్ల బయోపిక్ లను తీయడం సాధారణమే. వాళ్ల జీవితాన్ని చూసి ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని బయోపిక్ లను తీస్తుంటారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో ఎన్టీఆర్, సావిత్రి ల బయోపిక్ లు ఇప్పటికే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లెంజండరీ నిర్మాత డి రామానాయుడు బయోపిక్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్న ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబుకు తాజాగా ఎదురయ్యింది.
Advertisement
కాగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అందరూ అడుగుతున్నారు కానీ ఇంకా బయోపిక్ ను ప్లాన్ చేయలేదని చెప్పారు. బయోపిక్ అంటే వ్యక్తిగత విషయాలను చెప్పాలని కానీ తమ కుటుంబం మొదటి నుండి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతుందని అన్నారు. కానీ ఇప్పుడు నాన్న బయోపిక్ తీస్తే అవన్నీ చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒక వేళ అలా కాకుండా సినిమా గురించి మాత్రమే తీస్తే చాలా బోరింగ్ గా ఉంటుందని అన్నారు.
Advertisement
అంతే కాకుండా సినిమా జీవితంలోనూ కొంతమందిని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉండవచ్చని ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆ కారణంతో కూడా బయోపిక్ ఆలోచన చేయలేదని చెప్పారు. ఇక అప్పట్లో చాలా బయోపిక్ లు వచ్చాయని వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయని అన్నారు.
కొన్నింటిని మారిస్తే అవే నిజం అని నమ్మేవాళ్లు ఉన్నారని చెప్పారు. మనకు తెలిసిన వారి చరిత్రల్లో నిజాలు లేకపోతే మనం చదివిన పుస్తకాల్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో తెలియదు కదా అంటూ కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా రామానాయుడి తనయుడిగా సురేష్ బాబు కూడా స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన సంగతి తెలిసిందే.