తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖా వాణి ఒకరు.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో అక్క, పిన్ని, వదిన, ఆంటీ వంటి విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ మధ్యకాలంలో సురేఖ వాణి సినిమాలలో నటించడం పూర్తిగా తగ్గించారు. ఈమెకు సినిమా అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్నారో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమవుతున్నారని మాత్రం తెలుస్తోంది.
Advertisement
ఇక సురేఖ వాణి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో అందరూ పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో ఆ సమయంలో ఈమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేస్తున్నటువంటి రచ్చ మామూలుగా లేదు. ఇలా సోషల్ మీడియాలో పొట్టి పొట్టి దుస్తులు ధరించి రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడంతో ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది.
Advertisement
ఇక ప్రస్తుతం పలు సినిమాలు షోలలో సందడి చేస్తున్నారు.ఇకపోతే సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎరుపు రంగు చీర కట్టుకొని దిగినటువంటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ ఫోటోలో ఈమె మెడలో తాళి వేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి అయ్యారు. సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకుందా..? లేక అసలు ఆమె మెడలో ఏంటీ తాళి అని ఆశ్చర్యపోయారు.
మరికొన్ని సినిమాల వార్తల కోసం ఇక్కడ చూడండి