Telugu News » Blog » సురేఖ వాణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా..?

సురేఖ వాణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా..?

by Manohar Reddy Mano
Ads
టాలీవుడ్ లో చాలా మంది లేడి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ వారిలో ప్రస్తుతం నటి సురేఖ వాణికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. అయితే కరోనా రాకముందు సురేఖ వాణి కూడా మామూలుగానే ఉండేది.
కానీ కరోనా సమయంలో తన కూతురు సుప్రీతతో కలిసి ఆమె కూడా టిక్ టాక్ వైదొలు చేయడం.. డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేసింది. ఇక ఇండియాలో టిక్ టాక్ బాన్ తర్వాత ఇంస్టాగ్రామ్ పైన పడింది.
ఇక అప్పటి నుడి ఇప్పటివరకు కూడా సురేఖ వాణి సోషల్ మీడియాలో ప్రతిసారి ఏదో ఒక్క పోస్ట్ అనేది పెడుతూనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఈ తల్లి, కూతురు కలిసి చేసే పనులపైన విమర్శలు కూడా వస్తాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు వీరు. అయితే ఇప్పుడు సురేఖ వాణి మళ్ళీ పెళ్లి చేసుకుతుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.
కానీ తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో దానికి వీరు క్లారిటీ ఇచ్చారు. సురేఖ వాణి, సుప్రీతను ఓ ఇంటర్వ్యూలో.. సురేఖ వాణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా.. దానికి సురేఖ వాణి నో అని చెప్పగా.. కూతురు మాత్రం అవును అని ఫన్నీగా సమాధానం ఇచ్చింది. పెళ్లి చేసేద్దాం.. సింగిల్ గా ఉంటె నా బుర్ర తింటుంది అని కూతురు సుప్రీత నవ్వుతు చెప్పింది. కానీ సురేఖ వాణి మాత్రం నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు అని ప్రకటించింది.