విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. భారత్ వేదికగా జరగనున్న మెగా క్రికెట్ సంగ్రామం రెండు నెలల్లో మొదలు కాబోతుంది. ధోని సారధ్యంలో టీమిండియా చివరిసారి ఇంకా 2011లో ప్రపంచ కప్ గెలిచింది. అంటే భారత్ కు వరల్డ్ కప్ వచ్చి పుష్కరకాలం అవుతుంది. ఈ ఏడాది సొంత గడ్డపై భారత్ ప్రపంచకప్ మహాసంగ్రామ లో అడుగు పెట్టబోతుంది. ఈసారి వరల్డ్ కప్ భారమంతా కోహ్లీదే.
Advertisement
ఓపెనర్ రోహిత్ శర్మ ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడగలడు. కానీ చేజింగ్ సమయంలో కోహ్లీ మాత్రమే ఆ ఒత్తిడిని జయించగలడు. జట్టును చేజింగ్ చేయాల్సిన సమయంలో కోహ్లీ తన క్లాస్ ఆటతో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. అందుకే ఈసారి వరల్డ్ కప్ భారాన్ని కోహ్లీ మాత్రమే మోయగలడని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఈ ఏడాది వరల్డ్ కప్ మహాసంగ్రామంలో కోహ్లీ డైమండ్ తో తయారు చేసిన బ్యాట్ తో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
సూరత్ కు చెందిన బిజినెస్ మెన్ ఉత్పల్ మిస్త్రి కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్ గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. 1.04 క్యారెట్ల వజ్రాలు పొదిగిన బ్యాట్ ను తయారు చేసి కోహ్లీకి ఇస్తాడట. ఈ బ్యాట్ ధర అక్షరాల 10 లక్షలు. బ్యాట్ ను తయారు చేయడానికి కనీసం నెల సమయం పడుతుంది. అందువల్ల ఈనెల అంతా తాను కోహ్లీ బ్యాట్ కోసమే సమయం వెచ్చించమన్నాడు. వరల్డ్ కప్ లోపు కోహ్లీని కలిసి డైమండ్ బ్యాట్ ను ఇవ్వాలనుకుంటున్నట్టు ఉత్పల్ మిస్త్రి చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ ఆ బ్యాట్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆడుతాడా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్ అయిన విండీస్ బాహుబలి..
సీఎం జగన్ ను తెలంగాణ వాళ్లు..రాళ్లతో తరిమి కొట్టారు – పవన్ కళ్యాణ్
Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?