టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు సురేఖ వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అక్క వదిన పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాలలో బ్రహ్మానందంకు భార్య నటించి కామెడీని సైతం పండించారు. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ సురేఖ వాణికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సురేఖవాణి కూతురు సుప్రీత కూడా సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు.
ALSO READ : హీరో నాని భార్య అంజన బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!
Advertisement
తల్లితో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ సెలబ్రెటీలకు ఉన్నంత క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుప్రీతకు చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రీత షాకింగ్ కామెంట్లు చేసింది. అంతే కాకుండా తన జీవితంలో వచ్చిన ఇబ్బందులను సైతం బయటపెట్టింది. సురేఖవాణి భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే సింగర్ సునిత రెండో పెళ్లి తరవాత సురేఖ వాణి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
Advertisement
కాగా ఆ వార్తలపై సుప్రిత స్పందించింది. తన తల్లికి నిజంగానే మళ్లీ పెళ్లి చేయాలని ఉందంటూ బాంబు పేల్చింది. అయితే ఈ విషయంలో పూర్తి నిర్ణయం తన తల్లిదేనని చెప్పింది. తనకైతే పెళ్లి చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. అన్నింటినీ టైం డిసైడ్ చేస్తుందంటూ సుప్రీత కామెంట్ చేసింది. ఇక తన తండ్రి చనిపోయిన సమయంలో తన తల్లి ఎంతో ఆవేదన చెందినని చెప్పింది. అందులో నుండి బయటకు తీసుకురావడానికి పార్టీలకు తీసుకువెళితే బాధ లేకుండా పార్టీలకు తిరుగుతున్నారంటూ కామెంట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన కెరీర్ కంటే సురేఖవాణి తన కూతురు కెరీర్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని..ఎప్పుడూ తన కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుందని సుప్రీత తెలిపింది. తన తండ్రి ఉన్నప్పుడు కూడా సురేఖ వాణి ఎంతో కష్టపడిందని తెలిపింది. చిన్న పాత్రలు చేసి కూడా ఆ డబ్బులను కుటుంబం కోసం ఖర్చు చేసేవారని తెలిపింది. తన తండ్రి ఛానల్స్ మారినప్పుడు ఆర్థికఇబ్బందుల్లో తన తల్లే కుటుంబాన్ని పోశించిందని సుప్రీత చెప్పుకొచ్చింది. తన తల్లి ఏది చెబితే తాను అదే వింటానని తెలిపింది.