టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి తెలియని వారు ఉండరు. టీమిండియాలో దాదాపు 150 స్పీడ్ తో బంతులు వేయగల సమర్ధుడు మహమ్మద్ షమీ. అయితే మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ గత కొన్ని రోజులుగా… తన భార్య కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. 2018 సమయంలో మహమ్మద్ షమీ పై… అతని భార్య హసీన్ వరకట్న వేధింపులు అలాగే దాడి లాంటి ఆరోపణలు చేసి… పశ్చిమ బెంగాల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Advertisement
దీంతో బౌలర్ షమీపై దాడి, హ*యత్నం మరియు గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదు అయింది. ఇక అప్పటినుంచి కోర్టు చుట్టే షమీ తిరుగుతున్నాడు. ఇక ఈ కేసులో.. ఈ ఏడాది మార్చి 29వ తేదీన… మహమ్మద్ షమీ పై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను కలకత్తా హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు వారెంట్ ను నిలిపివేయడం పై తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది మహమ్మద్ షమీ భార్య హసీన్.
Advertisement
ఇక దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహమ్మద్ షమీ పై నమోదైన ఈ కేసు విషయంలో కేవలం నెలరోజుల్లోపే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అరెస్ట్ వారెంట్ పై నెలరోజుల్లోపే తీర్పు ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఈ నెల రోజులలోపు మహమ్మద్ షమీపై పశ్చిమ బెంగాల్ సెషన్స్ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Praveen Kumar : టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ కారుకు ప్రమాదం
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?