తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉందంటే దానికి మెయిన్ పిల్లర్ లాంటివారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎంతో డెవలప్ చేశారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీ ద్వారా ఆయన ఎంత సంపాదించారో ఇండస్ట్రీ ఎదగడానికి కూడా అంతే ఖర్చు చేశాడు. సినిమా సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేశాడు.
also read:“ఖలేజా” మూవీ కథను త్రివిక్రమ్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా..?
Advertisement
Advertisement
ఇప్పటి సినిమాలు విడుదలై 200 కోట్లు నుంచి 300 కోట్లు కలెక్షన్స్ సాధిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇలా కోట్ల రూపాయల కలెక్షన్ అనే పదం ముందుగా కృష్ణకు మాత్రమే సొంతమైంది. కృష్ణ నటించి దర్శకత్వం వహించిన సింహాసనం మూవీతోనే ఇది సాధ్యమైంది అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా విడుదలై కోటికి పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. 30 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగిన కృష్ణ దాదాపు 317 చిత్రాల్లో నటించి మెప్పించాడు.
also read:మీకు డయాబెటిసా.. ఈ బీరకాయ తిన్నారో అంతే..!!
అంతేకాకుండా కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 18 సినిమాలు చేసి విడుదల చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే అని చెప్పవచ్చు. చిత్రాల విషయానికొస్తే తాజ్ మహల్, మొనగాడు వస్తున్నాడు, అంతా మనమంచికే, హంతకులు దేవాంతకులు, కోడలు పిల్ల, పండంటి కాపురం, నిజం నిరూపిస్తా, అబ్బాయిగారు అమ్మాయిగారు ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆయన. అలాగే ఒకే ఏడాదిలో పదికి పైగా చిత్రాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి.
also read:మెగాస్టార్ కు కార్లు అంటే పిచ్చి.. ఆ అవమానమే ఇలా మార్చిందా..?