Home » “ఖలేజా” మూవీ కథను త్రివిక్రమ్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా..?

“ఖలేజా” మూవీ కథను త్రివిక్రమ్ ఏ హీరో కోసం రాసుకున్నాడో తెలుసా..?

by AJAY
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథను అందించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు మాటలను కూడా అందించాడు. అలా త్రివిక్రమ్ కథను మరియు మాటలను అందించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి.

Advertisement

అలా తాను కథను… మాటలను అందించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉండడంతో తానే స్వయంగా “నువ్వే నువ్వే” మూవీతో దర్శకుడుగా మారాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా సినిమాలు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా… కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా కూడా మిగిలాయి.

Advertisement

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచి చివరగా ఫ్లాప్ గా మిగిలిన సినిమాలలో ఖలేజా సినిమా ఒకటి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం టీవీలో ఎప్పుడు ప్రసారం అయిన ఈ మూవీకి అదిరిపోయే రేంజ్ టిఆర్పి రేటింగ్ వస్తూ ఉంటుంది.

ఈ సినిమాలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథను త్రివిక్రమ్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట. కాకపోతే మహేష్ కు కూడా ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading