తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా కండిషన్ గా వ్యవహరించారట.. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత కృష్ణ సతీమణి ఇందిరా దేవి ఇటీవల మరణించారు. దీంతో కృష్ణ చాలా కుంగిపోయారు.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కృష్ణ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తన కూతుర్లలో ఒకరైన మంజులకు సినిమాల్లో రాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణ ఆ కోరికను చంపేశారట కృష్ణ..
also read:తగ్గేదే లే అంటున్న వెన్నెల కిషోర్.. ఎంత రెమ్యూనరేషన్ అంటే..!!
Advertisement
తన కుటుంబంలో ఎవరికి ఏం కావాలన్నా అన్ని తీర్చే కృష్ణ తన కూతురు విషయంలో మాత్రం చాలా కర్కశంగా వ్యవహరించారనీ ఆమెకు అన్యాయం చేశారని సీనియర్ జర్నలిస్టు రామారావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే మంజులకు సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని బలమైన కోరిక ఉండేదట. కానీ కృష్ణ అభిమానులు కృష్ణ గారి కుమార్తె హీరోయిన్ గా చేయడం ఏంటని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన కూతురి కోరికను వద్దని చెప్పేశారట.. బాలకృష్ణ హీరోగా, మంజూష హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా చేయాలనుకున్నారట.. కానీ అప్పట్లో అన్ని సమయాల్లో ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చిన కృష్ణ, ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణతో మంజుల నటించడం ఏంటని కృష్ణ అభిమానులు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారట. దీంతో ఆమె సినిమాల్లోకి రావడం మానేసింది.
అంతేకాకుండా మంజుల ప్రేమ విషయంలో కృష్ణ ఆమెను ఇబ్బంది పెట్టారని, ఆయనకు పెళ్లై భార్య ఉండి కూడా తను ప్రేమించిన విజయ నిర్మల ను పెళ్లి చేసుకున్నారు. ప్రేమ విషయంలో ఉన్నతంగా ఆలోచించే కృష్ణ తన కుమార్తె ప్రేమ విషయంలో మాత్రం ఆలోచించలేక పోయారని రామారావు తెలియజేశారు. మంజుల అప్పట్లో సంజయ్ స్వరూప్ ను ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో కృష్ణ కు ఇష్టం లేదు. ఇలా ఆయన 1,2 సంవత్సరాలు కాకుండా తొమ్మిది సంవత్సరాల పాటు వారి పెళ్లికి ఒప్పుకోలేదట. చివరికి ఇందిరాదేవి పట్టుబట్టి కృష్ణతో ఒప్పించిందని వారి ప్రేమ కోసం తొమ్మిదేళ్లపాటు మంజుల ప్రేమ త్యాగం చేసిందని రామారావు తెలిపారు. ఇలా తన సినీ కెరీర్ విషయంలో, ప్రేమ విషయంలో మంజులను కృష్ణ ఇబ్బందులకు గురి చేశాడని ఆయన అన్నారు.
also read: