సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తండ్రి సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన సొంత టాలెంట్ తో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులలోను అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన వర్క్ చేసిన సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆయన వయసు తగ్గుతూ వస్తోంది. అంతగా.. ఆయన తన శరీరం, ఆరోగ్యం పట్ల కేరింగ్ తీసుకుంటూ ఉన్నారు.
Advertisement
అయితే.. హెల్త్ అండ్ ఫిట్ నెస్ విషయంలో చాలా పర్టిక్యూలర్ గా ఉండే మహేష్ బాబు కు ఓ చెడు వ్యసనం ఉందట. తనకి కూడా ఈ అలవాటు ఉంది అంటూ మహేష్ బాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇంతకీ ఆయనకు ఉన్న ఈ చెడు వ్యసనం ఏంటి, ఆయన ఈ విషయాన్నీ ఎప్పుడు చెప్పారు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. మల్టీ స్టోర్స్ కంపెనీ ‘బిగ్ సీ’ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజాగా.. ఈ కంపెనీ ఇరవైవ వార్షికోత్సవ సంబరాలలో మహేష్ బాబు పాల్గొని సందడి చేసారు. ఈ సందర్భంగా కొందరు రిపోర్టర్లు ఆయనను ఇంటర్వ్యూ చేసారు. ఓ రిపోర్టర్ ఆయనను మీరు మొబైల్ ఎంత సేపు చూస్తారు? అని ప్రశ్నించారు. దానికి మహేష్ బాబు చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. అందరిలానే, నేను కూడా గంటల తరబడి మొబైల్ చూస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు ఇలా గంటల తరబడి మొబైల్ చూడడం వలన తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు ఈ అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు
హీరోయిన్ శ్రీలీల సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..? అందుకోసమేనా ?
ఆ స్టార్ హీరోతో నిత్యామీనన్ డేటింగ్…రహస్యంగా ఇక ఆ పని కూడా…?