Sr.Ntr: సినిమాల్లో హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీరామారావు రాజకీయాల్లోనూ అదేస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. తన పథకాలతో పేద ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. అయితే ఎన్టీఆర్ రాజకీయజీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. 1984 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ పరిణామాలను ఎవరూ ఊహించలేకపోయారు. ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు.
Advertisement
ఎలాంటి రాజకీయ చిరిత్ర లేకుండా వచ్చిన ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా పాలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు తిరుగులేదని అనుకున్నారు. అసమ్మతికి అసలే చోటు లేదనుకున్నారు. కానీ చివరికి అసమ్మతితో పార్టీ చీలడం వల్ల ఎన్టీఆర్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ 1984 సంవత్సరం జులై లో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలోనే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. నాందెండ్ల భాస్కర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీలో చీలిక తీసుకువచ్చారు.
Advertisement
అమెరికా నుండి ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ చేయించుకుని వచ్చిన రెండు రోజుల్లోనే గవర్నర్ ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా నాదెండ్లతో ప్రమాణస్వీకారం కూడా చేయించాడు. భర్తరఫ్ కు నిరసనగా ఎన్టీఆర్ తో కలిసి కొంతమంది ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వద్ద నిరసనకు దిగారు. ఉద్రిక్తపరిస్థితుల మధ్య ఎన్టీఆర్ తో పాటూ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో రాష్ట్రమంతా సభలు ర్యాలీలతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుండి మోహన్ బాబు, మురళీ మోహన్ తో పాటూ ప్రముఖ నిర్మాతలు ఎన్టీఆర్ కు మద్దతుగా పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల భాస్కర రావుకు అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ కృష్ణ పత్రికా ప్రకటన ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణ ఇచ్చిన ప్రకటనపై చాలా మంది మండిపడ్డారు. థియేటర్లలో ఆయన సినిమాలను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేఖంగా నిరసనలు చేశారు. దాంతో ఆ తవరాత రోజు కృష్ణ…నేను ప్రజల మనిషేనే కానీ పార్టీల మనిషిని కాదు అంటూ మరో ప్రకటన కూడా ఇచ్చారు. ఎవరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా వారిని అభినందించడం తనకు అలవాటని చెప్పారు. ఎన్టీఆర్ పై అభిమానం ఎప్పుడూ అలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరవాత గొడవలకు పులిస్టాప్ పడింది.
ALSO READ:
అల్లు రామలింగయ్య అల్లుడయ్యినందుకే చిరు హీరోగా ఎదిగారా..? అందులో నిజమెంత..!