IPL 2023 16వ సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే, కోల్కత్తా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న అయ్యర్ సర్జరీ కోసం లండన్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపిఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు దూరం కానున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
READ ALSO : IPL 2023 : ఐపీఎల్ కోసం రంగంలోకి రష్మిక, తమన్నా !
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ సారథిగా ఎవరు వ్యవహరిస్తున్నది అందరి మెదడులను తోలుస్తున్న ప్రశ్న. కాగా కోల్కత్తా కెప్టెన్సీ రేస్ లో స్టార్ ఆల్ రౌండర్లు షకీబ్ ఆల్ హాసన్, సునీల్ నరైన్, రస్సెల్ ఉన్నారు. అయితే కేకేఆర్ టీం మేనేజ్మెంట్ మాత్రం సునీల్ నరైన్ వైపే ముగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన విదేశీ క్రికెటర్లలో సునీల్ నరైన్ ఒకడు. అతడు ఇప్పటివరకు ఐపిఎల్ లో 148 మ్యాచులు ఆడాడు. అదే విధంగా కేకేఆర్ జట్టులో సీనియర్ ఆటగాడిగా కూడా సునీల్ నరైన్ ఉన్నాడు.
READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?
అతడు కేకేఆర్ తరపున 170 వికెట్లు సాధించాడు. అదేవిధంగా యూఏఈ టి20 లీగ్ లో కోల్కత్తా ఫ్రాంచైజీ అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్ గా కూడా సునీల్ నరైన్ వ్యవహరించాడు. అయితే ఈ టోర్నిలో అబుదాబి నైట్ రైడర్స్ ఆడిన పది మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ సునీల్ నరైన్ కు అనుభవం దృష్ట్యా అతడికే మరోసారి తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ జట్టు మేనేజ్మెంట్ తెలుస్తోంది.
READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!