ఐపీఎల్ అనేది ఇప్పుడు క్రికెట్ లోనే అతి పెద్ద ఈవెంట్ అని చెప్పాలి. ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్స్ కంటే ఐపీఎల్ కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే ఈ ఐపీఎల్ అనేది 2008 లో ప్రారంభమై ఇప్పటివరకు 15 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నా ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద క్రీడా టోర్నీగా నిలిచింది.
Advertisement
ఇక ఇప్పటికే ఐపీఎల్ వల్ల బీసీసీఐకి వస్తున్న ఆదాయం చూసి ఏడుస్తున్న దేశాలు ఇప్పుడు.. ఐపీఎల్ పై తప్పుడు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది నుండి సౌత్ ఆఫ్రికా, యూఏఈ వంటి దేశాలు కొత్త క్రికెట్ లీగ్స్ ప్రారంభిస్తున్న సమయంలో ఆటగాళ్లు అందరూ వాటిలో పాల్గొనడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల ఆయా దేశాల బోర్డులు ఇందుకు కారణం ఐపీఎల్ అంటూ కామెంట్స్ చేస్తున్నాయి.
Advertisement
ఇక ఈ కామెంట్స్ పై స్పందించిన భారత మాజీ స్టార్ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఐపీఎల్ విమర్శకులకు అందరికి గట్టి సమాధానం ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా, యూఏఈ కొత్త లీగ్స్ అనేవి ప్రారంభిస్తే అందరూ ఐపీఎల్ ను దోషిని చెయ్యడం వింతగా ఉంది అన్నారు. ఇక మేము ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా గవాస్కర్ చెప్పారు. అయితే ఈ కొత్త లీగ్స్ వల్ల వారు నిర్వహిస్తున్న లీగ్స్ కు నష్టం వస్తుందేమో అని వారు ఇలా చేస్తున్నారు అని సన్నీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి :