ఐపీఎల్ 2022 లో ముంబై జట్టు తరపున అడవుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆదరగొడుతున్న విషయం తెలిసిందే. తిలక్ వర్మ ను ముంబై ఇండియాన్స్ మెగా వేలంలో కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ముంబై జట్టు తరపున ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. అతను ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఈ ఐపీఎల్ లో రాణిస్తున్న తిలక్ వర్మ పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.
Advertisement
తాజాగా సన్నీ మాట్లాడుతూ… నన్ను తిలక్ వర్మ బాగా ఆకట్టుకుంటున్నాడు. అతను ఈ వయస్సులోనే ఎంతో మెచ్యూరిటీని చూపించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. వరుస వికెట్లు పడుతుంటే… తీవ్ర ఒత్తిడిలో కూడా అతను పరిస్థితులకు తగ్గట్లుగా భారీ షేర్లు ఆడి ఔట్ కాకుండా… సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించడం బాగుంది. అలాగే అతను వైడ్ రేంజ్ షాట్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడం చూస్తుంటే గొప్ప క్రికెటర్ అవుతాడు అని అనిపిస్తుంది అంటూ గవాస్కర్ అన్నారు.
Advertisement
కానీ తిలక్ వర్మ ఆ రెండు విషయాలను మెరుగుపర్చు కోవాలి అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఆటగాడు ఎప్పుడు తన వ్యక్తిగత ప్రదర్శనను విశ్లేషించుకొని పరుగులు చేయవచ్చు. కానీ దానికోసం తిలక్ వర్మ ఇంకా ఎక్కువ కష్టపడాలి.. అలాగే అతను తన ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాలి.. ఇంకా తన టెక్నిక్‌ను పటిష్టంగా మార్చుకోవాలి. ఈ విషయాలలో తిలక్ బాగా మెరుగైతే రోహిత్ శర్మ చెప్పినట్లు తిలక్ వర్మ భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతాడు అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
నేను ఆ ఓవర్ వేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలిచేది..!
2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!