Home » సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కొట్టడంలో ఫెయిల్ అయిన దర్శకులు వీరే… ఆ సినిమాలు ఇవే..!

సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కొట్టడంలో ఫెయిల్ అయిన దర్శకులు వీరే… ఆ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి సుకుమార్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఆర్య మూవీతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వాటితో ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన వారు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

sukumar

sukumar

అందులో ఎక్కువగా శాతం మంది సూపర్ సక్సెస్ను కూడా అందుకున్నారు. ఉప్పెన మూవీతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టిన బుచ్చిబాబు సనా… కుమారి 21ఎఫ్… 18 పేజెస్ మూవీ లతో మంచి విజయాలను అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్… దసరా మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెలా… విరూపాక్ష మూవీతో సూపర్ సక్సెస్ను సాధించిన కార్తీక్ దండు వీరంతా కూడా సుకుమార్ శిష్యులే. ఇలా సుకుమార్ దగ్గర పనిచేసి సినిమాలకు దర్శకత్వం వహించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వీరితో పాటు సుకుమార్ దగ్గర పని చేసి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.

Advertisement

Advertisement

2012వ సంవత్సరంలో రానా “నా ఇష్టం” అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించాడు. ఈయన సుకుమార్ శిష్యుడే. ఈ మూవీతో ఈయన బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అనుకున్నాడు.

దర్శకుడు… ప్లే బ్యాక్ మూవీలకు దర్శకత్వం వహించినటువంటి జక్కా హరి ప్రసాద్ కూడా సుకుమార్ శిష్యుడే. ఈయన కూడా దర్శకుడుగా సక్సెస్ కాలేదు. ఈయన దర్శకత్వం వహించిన ప్లే బ్యాక్ మూవీ బాగానే ఉన్నప్పటికీ కరోనా ప్రభావం వల్ల ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గుర్తింపు లభించలేదు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీకి దర్శకత్వం వహించినటువంటి మున్నా అలియాస్ ఫణి ప్రదీప్ కూడా సుకుమార్ శిష్యుడే.

 

ఇలా ఈ ముగ్గురు సుకుమార్ దగ్గర పని చేసిన వారిలో డైరెక్టర్లుగా ఇంకా సక్సెస్ కాలేదు.

Visitors Are Also Reading