Home » కళ్యాణి, సూర్య కిరణ్ లు అందుకే విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సుజిత

కళ్యాణి, సూర్య కిరణ్ లు అందుకే విడాకులు తీసుకుని విడిపోయారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సుజిత

by Mounika
Ad

సత్యం, ధన51, బ్రహ్మాస్త్రం, రాజూ భాయ్ సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు సూర్య కిరణ్ అంటే ఎవరికీ గుర్తుకురాదు. అదే బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ సూర్య కిరణ్ అనగానే టక్కున ఎవరికైనా సరే గుర్తుకు వస్తారు. ఈయన కేవలం  డైరెక్టర్ మాత్రమే కాదు మంచి యాక్టర్ కూడా. ఇక సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిది  ప్రేమ వివాహం అయినప్పటికీ  వారి సంసారంలో  మనస్పర్థలు రావడంతో 2016 లో విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి పలికారు.ఆయనకు ఇష్టం లేకపోయినా  కళ్యాణికి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని గతంలో ఎన్నో సందర్భాల్లో  సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement

తాజాగా వీరిద్దరి  విడాకులు విషయంపై  విడాకుల  మరోసారి చర్చలు మొదలయ్యాయి. అందుకు కారణం ప్రముఖ సీరియల్ నటి సుజిత.  ఈమె చిరంజీవి హీరోగా నటించిన  పసివాడి ప్రాణం సినిమాలో  చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. కొంతకాలం తర్వాత సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.  సుజిత జై చిరంజీవ ఆజాద్ వంటి సినిమాల్లో చెల్లెలి పాత్రలు పోషించింది. సూర్య కిరణ్ కి సుజిత స్వయానా చెల్లెలు అవుతుంది. అంతేకాదు సూర్య కిరణ్  కళ్యాణి ల పెళ్లి జరగడానికి కారణం కూడా ఈమెనట.

 ఇండస్ట్రీలో ఏర్పడిన పరిచయం ద్వారా కళ్యాణి సుజిత మొదటిగా మంచి ఫ్రెండ్స్ అయ్యారట.  సుజితకి సూర్య కిరణ్ సొంత అన్నయ్య కావడంతో కళ్యాణితో  పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2005 సంవత్సరంలో కళ్యాణి, సూర్యకిరణ్  వివాహంతో ఒకటయ్యారు. కానీ వాళ్ళు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఆర్థిక ఇబ్బందులు అని సుజిత చెప్పుకొచ్చారు. సూర్య కిరణ్ నిర్మాతగా కూడా మారి ఒకటి రెండు సినిమాలు తీయడంతో అవి  ఫ్లాప్ అయ్యి  అప్పుల పాలయ్యారు. అలా ఈ జంట ఆర్థిక ఇబ్బందులతో విడిపోయారని స్పష్టమవుతుంది

Visitors Are Also Reading