తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యంగ్ డైరెక్టర్లలో సుజిత్ ఒకరు. ఈ దర్శకుడు శర్వానంద్ హీరోగా రూపొందినటువంటి రన్ రాజా రన్ మూవీ తో సినిమా దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించాయి.
Advertisement
ఆ తర్వాత ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీకి దర్శకుడు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన ఈ సినిమా మిగతా భాషల్లో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినప్పటికీ హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతంగా ఆదరించింది. దానితో ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.
Advertisement
ఇది ఇలా ఉంటే సాహో మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “ఓజి” అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ సుజిత్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే … ఇతనిది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 2020 వ సంవత్సరంలో సుజిత్… ప్రవల్లిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం సుజిత్… ప్రవల్లి క పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి ఫోటోలను చూసిన కొంతమంది నెటిజెన్లు ప్రవల్లిక అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.