ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ పాత్ర నుంచి కేవలం తల్లి, అమ్మ, అక్క, వదిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి కొన్ని వందలకు పైగా సినిమాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు.
ఇక సుహాసిని కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను, చేదు జ్ఞాపకాలను అందరితో షేర్ చేసుకున్నారు. ఇక సుహాసిని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఒక్కోసారి కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నేను కరాకండిగా తిరస్కరించేదాన్ని. ఇక ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం చేయమని డైరెక్టర్ గారు చెప్పి నన్ను చాలా బలవంతపెట్టారు. ఇక నేను చేయనని గట్టిగా చెప్పాను.
Advertisement
Advertisement
ఇక మరో సినిమాలో హీరో తిన్న ఎంగిలి ఐస్ క్రీమ్ ని తినమని అన్నారు. వేరే వారు తిన్న ఐస్ క్రీమ్ ని నేనెందుకు తినాలి, అలా తినడం ఏంటి అని డైరెక్టర్ ని ప్రశ్నించాను. ఇక సుహాసిని చేసిన కామెంట్స్ విన్న అభిమానులు కొంతమంది…. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ మీరు నిర్మొహమాటంగా అలా మొహం మీద చెప్పేయడం వల్లనే సక్సెస్ఫుల్ ఇంకా ఇండస్ట్రీలో ఎలాంటి రిమార్క్ లేకుండా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కునే ఉంటారు.
ఇవి కూడా చదవండి
- Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఆ రిలేషన్..?
- ఈ ఒక్క సీన్ కోసం…రూ.20 లక్షలు వసూలు చేసిన రష్మిక…!
- బాబర్ కు కోహ్లీ ఏం బహుమతి…పాకిస్థాన్ ఇజ్జత్ తీశావంటూ ట్రోలింగ్ !