షుగర్ ఉన్న వారు దాని నుంచి ఉపశమనం కోసం అరికెలన్నం వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో కూడా షుగర్ రాకుండా ఉండాలని అనుకునేవారు ఈ అరికలను తీసుకోవచ్చు. 100 గ్రాముల అరికలను తీసుకుంటే అందులో 65 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం రోజూ తినే అన్నం కంటే ఇందులో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
Advertisement
Advertisement
ఈ అరికలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఉపయోగం ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే బీటా కణాలను స్టిములేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి కొంచెం పెరగడానికి అరికలు చాలా ఉపయోగపడతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. అరికలలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ క్వర్సిటిన్ పి హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ మరియు సిరంజిక్ యాసిడ్ ఈ రెండింటి కాంబినేషన్ అరికలలో ఉండడం వల్ల బీటా కణాలను స్టిములేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి కొంతమేరకు బాగా పెరిగేటట్లు చేయడానికి వీటి కాంబినేషన్ ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ అరికల లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ స్థాయి లో రిలీజ్ అయిన గ్లూకోజ్ మెల్లగా అరిగి స్లోగా గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తాయి. అలాగే రిలీజ్ అయిన గ్లూకోజ్ కూడా ఒకే సారి బ్లడ్ లోకి వెళ్లి కలవకుండా స్లోగా వెళ్లేలా ఇందులో ఉండే ఫైబర్ కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి అరికలు ఉపయోగపడుతున్నాయి.
ALSO READ :
జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. ఇలాంటివి చేయకూడదని మీకు తెలుసా..!!