ఇప్పటికే మన పురాణ గాథల్లో ఎంతోమంది స్త్రీలు శక్తి మణులుగా నిలిచారు. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో సరోజినీ నాయుడు, మదర్ తెరిసా వంటి దేశవ్యాప్తంగా ఎంతో ధైర్యంతో పోరాడి గెలిచిన ధీరులు ఉన్నారు. అంతేకాకుండా దేశాన్ని మొత్తం ఏకచత్రాధిపత్యంలోకి తీసుకువచ్చి ఏలిన ఇందిరాగాంధీ లాంటి ధైర్యశాలులు ఉన్నారు. అలాంటి ఓ ధైర్యశాలి గురించి ఐఏఎస్ ఆమ్రపాలి తన ఫేస్బుక్ ఖాతాలో ఒక కథను షేర్ చేసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఆ మహిళా మణి ఎవరు.. ఏం పని చేస్తుందో వివరాలు చూద్దాం.. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తేనే జీవితాన్ని వద్దనుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు..
Advertisement
also read:హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !
Advertisement
అలాంటివారికి ఈమె ఒక ఇన్స్పిరేషన్. ఇలాంటి విపత్కర పరిస్తితులను ఎలా ఎదుర్కోవాలో ఈమెని చూసి నేర్చుకోవచ్చు.. ఇంతకీ ఆవిడ ఎవరయ్యా అంటే.. ఈ ట్రక్ నడుపుతున్న మహిళ పేరు యోగితా రఘువంశీ.. ట్రక్ నడుపుతోంది.. నడపడం ఏమైనా గొప్ప విషయమా అని మీరు అనుకోవచ్చు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అది మామూలు ట్రక్ కాదు 14 చక్రాల వాహనం, 30 టన్నుల లగేజీతో నడుపుకుంటూ గమ్యస్థానాన్ని చేరడం .. అది ఒక సాధారణ మహిళ నడపడం అంటే మామూలు విషయం కాదు. అయితే యోగితా ఒక లాయర్.. భర్త ట్రక్ నడుపుతూ జీవనాన్ని సాగిస్తుండేవారు. సంతోషంగా సాగుతున్న జీవితంలో విధి వంకర తలచింది..
తన భర్త మరణించాడు. దీంతో పిల్లలతో ఒంటరిగా ఉన్న యోగితాకు బతుకు బండి లాగడం కష్టమైంది. భర్త నడిపే ట్రక్కుకు డ్రైవర్ ను పెట్టింది. అయినా ఫ్యామిలీ గడవడం కష్టంగా ఉండడంతో డ్రైవర్ కి ఇచ్చే డబ్బులను ఆదా చేయాలనుకుంది. తానే ట్రక్కు నడపడం నేర్చుకుంది. ఆ విధంగా టన్నుల కొద్దీ బరువు ఉన్న లోడ్ ను గమ్యస్థానాలకు చేర్చుతూ తాను డ్రైవర్ గా కొనసాగుతూ ఫ్యామిలీని పోషించుకుంటుంది. మనదేశంలో ఇన్ని టైర్ల ట్రక్ నడిపే మొదటి మహిళా యోగిత రఘువంశీయే..
also read: