Home » యోయో టెస్ట్ అంటే ఏంటి.. దీన్ని ఎలా నిర్వహిస్తారు.. క్రికెటర్లకు చాలా కీలకం..!!

యోయో టెస్ట్ అంటే ఏంటి.. దీన్ని ఎలా నిర్వహిస్తారు.. క్రికెటర్లకు చాలా కీలకం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

భారత క్రికెట్ బోర్డు( బిసిసిఐ )మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు కూడా ప్లేయర్ల యొక్క ఫిట్నెస్ ను పరీక్షించడం కోసం యోయో టెస్టును నిర్వహిస్తున్నాయి. ఆటగాళ్లు ఫామ్ లో ఉన్న ఫిట్నెస్ లేకపోతే దండగ అనే ఉద్దేశంతో ఈ టెస్ట్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి.. మరి యోయో టెస్ట్ అంటే ఏమిటి.. ఎలా నిర్వహిస్తారు వివరాలు చూద్దాం .. ఈ యోయో టెస్టులో ప్లేయర్స్ నిర్ణయించిన నిర్దిష్ట సమయంలో గమ్యాన్ని చేరుకోవాలి. ఇందులో మూడు రౌండ్లు ఉంటాయి. ఈ మూడు రౌండ్లలో ప్లేయర్ అనుకున్న సమయంలో గమ్యాన్ని చేరుకోకపోతే అతడు ఫెయిల్ అయినట్టు లెక్క. యోయో టెస్టులో రౌండ్లు మారినాకొలది నిర్దిష్టమైన దూరాన్ని చేరుకునే సమయాన్ని తగ్గిస్తారు.

Advertisement

also read:తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

Advertisement

ఉదాహరణకు ఒక రౌండ్లో 30 సెకండ్లలో అనుకున్న సమయాన్ని చేరుకోవాలి. ఇక రెండో రౌండ్ వచ్చేసరికి 20 సెకండ్లు, ఇక మూడవ రౌండ్ లో 10 సెకండ్ లోనే ఆ నిర్దిష్ట దూరాన్ని రన్నింగ్ ద్వారా ఛేదించాలి.. రౌండ్ రౌండ్ కు మధ్య గ్యాప్ ఏమి ఉండదు. వెంట వెంటనే మూడు రౌండ్లు వారు పెట్టిన నిబంధనల ప్రకారం పూర్తి చేస్తే వారు యోయో టెస్టులో పాస్ అయినట్టు. అయితే ఈ టెస్టును నిజానికి ఫుట్బాల్ ప్లేయర్లకు నిర్వహించడం కోసం డాక్టర్ జెన్స్ బాగ్స్ బో అనే దాని సైంటిస్ట్ కనిపెట్టాడు.

అయితే యోయో టెస్టులో అన్ని రౌండ్స్ విజయవంతంగా పూర్తి చేస్తే గరిష్ట స్కోర్ 21. ఇది ఫుట్బాల్ ప్లేయర్లకు ఉంటుంది. కానీ ఇండియాలో క్రికెటర్లకు యోయో టెస్ట్ నిర్వహిస్తే సాధించాల్సిన కనీస స్కోర్ 161, ఈ స్కోర్ అనేది ఒక్కొక్క దేశం ఆయా క్రికెట్ బోర్డులు నిర్ణయం ప్రకారం స్కోరు నిర్ణయిస్తాయి. అయితే ఈ యోయో టెస్టులో పాస్ కావడం ఫిట్నెస్ ఉన్న ప్లేయర్లకు పెద్ద ఇబ్బంది ఏమి కాదు. కానీ ఫిట్నెస్ లేకుంటే ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం యో యో లాంటి కఠినమైన టెస్టులు ఉంటే మంచిదే అంటున్నారు నిపుణులు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

also read:

Visitors Are Also Reading