Home » డిగ్రీ చదివి యూట్యూబ్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంది… కట్ చేస్తే లండన్ లో 40 లక్షల జాబ్….!

డిగ్రీ చదివి యూట్యూబ్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంది… కట్ చేస్తే లండన్ లో 40 లక్షల జాబ్….!

by AJAY
Ad

ఇంజనీరింగ్ చదివిన చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు రావడం లేదంటూ ఖాళీగా ఉన్నారు. బీటెక్ పూర్తి చేసి ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగాలు లేవంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన ఓ యువతి డిగ్రీ పూర్తిచేసి లండన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించింది. అది కూడా ప్రముఖ సంస్థ అమెజాన్ లో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఏడాదికి 40 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం రావడం విశేషం. ఆ విద్యార్థి పేరు భావన…. కాగా ఆమె తండ్రి ఓ సాధారణ రైతు. భావన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఏడుళ్ళ బయ్యారం అనే ఏజెన్సీ ప్రాంత వాసి.

Advertisement

ఐదవ తరగతి వరకు తెలుగు మీడియం చదువుకొని ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం లో చేరింది. ఆరో తరగతి రెండు సార్లు చదవాల్సి వచ్చింది. పదవతరగతి కూడా అంతంత మాత్రమైన మార్పులతోనే పాస్ అయింది. ఇక 10 తర్వాత ఇంటర్ చదివేందుకు ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్ళింది. అక్కడ ఇంటర్ పూర్తిచేసింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే పేద కుటుంబంలో పుట్టడంతో తనకు ఎదురైన అవమానాలకు సక్సెస్ తో పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది.

Advertisement

డిగ్రీ పూర్తిచేసి సివిల్స్ లో ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నది. అందుకోసమే హైదరాబాద్ లో డిగ్రీ చేసేందుకు కాలేజీలో చేరింది. కానీ కరోనా కేసులు పెరగడం…. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం వల్ల సివిల్స్ లక్ష్యాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. ఇప్పటికైతే ఏదైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాలని అడుగులు వేసింది.

 

దాని కోసం యూట్యూబ్ లోనే ఇంగ్లీష్ శిక్షణ కూడా తీసుకుంది. ఇక ఈ శిక్షణ తోనే మొదట రెండు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు అయింది…. కానీ ఉద్యోగం రాలేదు. ఇక మూడో సారి ఏకంగా అమెజాన్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఈసారి ఆమె ప్రయత్నం ఫలించింది. అమెజాన్ ఐదు టర్మ్ లలో చేసిన ఇంటర్వ్యూలో క్వాలిఫై అయింది. దాంతో అమెజాన్ లో ఉద్యోగం వచ్చింది. అది కూడా లండన్ లో యేడాదికి 40 లక్షల ప్యాకేజీతో రావడం తో భవాన ఆనందానికి అవధులు లేవు.

Visitors Are Also Reading