Home » వాటే సక్సెస్.. పేదరికంతో పోరాటం చేస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు.!

వాటే సక్సెస్.. పేదరికంతో పోరాటం చేస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు.!

by Sravya
Ad

కొంతమంది సక్సెస్ ని చూస్తే శభాష్ అంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ఒక మార్కు రెండు మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు, ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే అందుకోసం ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణకు చెందిన భారత్ మాత్రం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలని సాధించి ప్రస్తుతం సంచలనంగా మారారు.

Advertisement

జనగామ జిల్లాకు చెందిన భరత్ ఒకపక్క పేదరికం ఇంకో పక్క విమర్శలతో కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం ఏకంగా ఐదేళ్లు కష్టపడ్డాడు. భరత్ తల్లిదండ్రులు కూలీగా పని చేస్తున్నారు. ఈ స్థాయికి చేరుకోవడం కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. డిప్లమో చేశాక భరత్ ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో భరత్ ఎంటెక్ పూర్తి చేశారు భరత్ కృషి పట్టుదలతో ఈ స్థాయికి చేరారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా లక్ష్యం వైపు వెళ్లారు.

Advertisement

కన్న కలలను సాకారం చేసుకున్నారు. కొడుకు గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కన్న కలను నిజం చేశాడు. తాజాగా విడుదలైన టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకారం భరత్ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తో కలిసి ఐదు ఉద్యోగాలు వచ్చాయని ఆయన అంటున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు వస్తాయని భరత్ అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading