సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో నటుడి అవకాశం రావడం కోసం ఇతర డిపార్ట్మెంట్ లలో కూడా పనిచేస్తూ పరిచాయలను పెంచుకొని ఆ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా చాలామంది ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది ప్రయత్నాలు ఫలించి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రం పెద్దగా ఎలాంటి కష్టం లేకుండా యాదృచ్ఛికంగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు.
Advertisement
అలా సినిమా ఇండస్ట్రీలోకి రావడం కోసం పెద్దగా కష్టపడకుండా అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సుబ్బరాజు ఒకరు. సుబ్బరాజు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. ఈ నటుడు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు అనే విషయాలను తెలుసుకుందాం.
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఆఫీసులో ఒకరోజు సిస్టమ్ పాడైందట. దానితో ఎవరైనా సిస్టమ్ బాబు చేసే వారిని పిలిచి బాగు చేయించండి కృష్ణవంశీ వారి ఆఫీస్ వారికి చెప్పారంట. అందులో భాగంగా ఒక వ్యక్తి వచ్చి సిస్టమ్ బాగు చేశాడట. ఆ వ్యక్తి మరెవరో కాదు సుబ్బరాజు.
అతనిని చూసిన కృష్ణవంశీకి ఇతని ఎత్తు… పర్సనాలిటీ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి అని తాను అప్పుడే తెరకెక్కిస్తున్న ఖడ్గం సినిమాలో నటుడిగా ఎంచుకున్నాడట. అలా ఖడ్గం మూవీ ద్వారా సుబ్బరాజు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.