ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైల్వే స్టేషన్ యే నా ఇల్లు., నా పేరు నాకు గుర్తులేదు. నాకు తెల్సిన వాళ్లంతా నన్ను పాగల్ ( పిచ్చోడా) అంటుంటారు. బహుషా ఇదే నా పేరేమో! అమ్మనాన్నలు కూడా గుర్తులేరు. పుట్టగానే చెత్తకుప్పకు చేరాననుకుంటా…. ఊహ తెలిసిన వరకు ఎలా బతికానో కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు చిత్తుకాగితాలు , ఫ్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ రోజుకు 20-30 రూపాయలు సంపాదిస్తున్నాను. నా తిండి ఖర్చులకు ఆ డబ్బులు సరిపోతున్నాయి. వర్షం వచ్చిన రోజు ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది.
Advertisement
Advertisement
పగలంతా బాగానే ఉంటుంది. రైల్వే స్టేషన్స్ పార్కులు చెట్లు పుట్టలు ఇలా తిరిగి తిరిగి చాలానే ప్లాస్టిక్ బాటిల్స్ ను సేకరిస్తాను కానీ రాత్రి వచ్చేసరికి భయమేస్తుంది. అందుకే ఒకరోజు సంపాదించిన డబ్బుతో అన్నం తినకుండా తాయెత్తు కొనుక్కున్నాను…అయినా రాత్రంటే నాకున్న భయం మాత్రం తగ్గలేదు. రాత్రి స్టేషన్ లో ఓ మూలకు కూర్చొని అక్కడ నా వయస్సున్న పిల్లల్ని గమనిస్తుంటాను….వారివారి తల్లులు వారిని ప్రేమగా చూసుకుంటుంటే భలే ముచ్చటేస్తుంది. గుర్తుతెచ్చుకుందామన్నా నాకు మాత్రం నా తల్లి ముఖం కూడా గుర్తుకురాదు. వారి అదృష్టాన్ని కాదనలేను, నా దురదృష్టాన్ని పొమ్మనలేను.