Home » Urination: మూత్ర విసర్జన సమయంలో ఈ ఇబ్బందా? అయితే ఈ ఫుడ్స్ మానేయడమే మంచిది!

Urination: మూత్ర విసర్జన సమయంలో ఈ ఇబ్బందా? అయితే ఈ ఫుడ్స్ మానేయడమే మంచిది!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఏడెనిమిది సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి అవసరం అయినప్పుడో, లేక మరెప్పుడైనా వెళ్ళడానికి వీలు కానీ పరిస్థితులలో చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. సమయం కుదిరినప్పుడు వెళ్తుంటారు. ఇది ఆరోగ్యకరమైనది కాకపోయినా.. మూత్రాన్ని ఆపుకొనడం అనే కంట్రోలింగ్ శరీరానికి ఉంటుంది. అయితే.. కొంతమందిలో ఇది లోపిస్తుంటుంది. వారు మూత్రాన్ని ఆపుకోలేకపోతుంటారు.

Advertisement

ఇది పరిమితికి దాటి ఉంటె, దానిని ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌ డిసీజ్‌ అని పిలుస్తారు. తగినన్ని నీళ్లు తాగితే.. ఎవరైనా రోజుకు ఏడెనిమిది సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. అయితే.. కొంతమంది మూత్రాన్ని పట్టి ఉంచలేక అస్తమానం వెళ్లాల్సి వస్తూ ఉంటారు. ఇలా పరిమితికి మించి మూత్ర విసర్జన చేయాల్సి రావడాన్ని ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌ డిసీజ్‌ అని పిలుస్తారు. ఈ సమస్య ఏ వయసులో అయినా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాల కారణంగా కూడా ఇలా జరగవచ్చు. కొన్ని ఆహార పదార్ధాలు మూత్రాశయం పై ఒత్తిడి తీసుకు వస్తాయి. దాని వలన ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. ఈ ఆహార పదార్ధాలను వదిలివేయడం ద్వారా ఈ సమస్యని ఎదుర్కొనవచ్చు. టీ- కాఫీలు, చాక్లెట్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌- సోడా, స్వీట్‌నర్స్‌, మసాలాలు, నమ్‌కీన్స్‌, టమాట-ఉల్లిగడ్డ, నిమ్మజాతి పండ్లు మూత్రాశయంపై ఒత్తిడి కలిగిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. కాజూ, బాదం, పల్లీలు, అరటిపండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, విటమిన్‌-కె పుష్కలంగా లభించే దోసకాయ కూడా మూత్రాశయ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి దోహదం చేస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటె వైద్యుడిని సంప్రదించాలి.

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

Visitors Are Also Reading