ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చాణక్య నీతిపేరుతో ప్రసిద్ది చెందింది. ఇతను చెప్పిన నీతులు మానవ జీవితంలో ఎలా ఉండాలి. ఎలాంటి పనులు చేయాలి. ఇంటి గురించి ఇంట్లో ఉన్న వస్తువుల గురించి.. ఇలా ఎన్నో నీతులు చెప్పాడు. చాణక్య చెప్పిన నీతులు ప్రతి ఒక్కరూ పాటిస్తే జీవితం విజయవంతంగా సాగుతోంది. గౌరవం పొందని ప్రదేశం.. మానవుడు పలు చోట్ల ఉండడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తరువాత బాదపడిన ఉపయోగముండదని చాణక్య చెప్పారు.
ఇక కొందరు మద్యలో ఉన్నప్పుడు మనుషులను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అగౌరవంగా చూస్తుంటారు. అలాంటి చోటులో ఉండడం వల్ల మనుషుల విలువలు తగ్గిపోతాయి. అలాంటి వారి మధ్యన ఉండకూడదు. చదువులేని ప్రదేశం, విద్యకు విలువ లేని చోట కూడా ఉండవద్దని చాణక్య తెలిపారు. అలాంటి ప్రదేశంలో ఉండడం వల్ల పిల్లల భవిష్యత్ కు భంగం కలుగుతుంది. అదేవిధంగా వారి జీవితం చీకటిమయమవుతుంది. సన్నిహితులు, బందువులు లేని ప్రదేశం ఎలాంటి వారికైనా సన్నిహితులు, బందువులు చాలా అవసరం. అలాంటి బంధాలు లేని చోట జీవించకూడదు.
Advertisement
Advertisement
అలాంటి ప్రదేశాన్ని వదిలి వెంటనే వెళ్లాలి. ఎందుకంటే మీకు ఎటువంటి సాయం కావాలన్నా ఎవ్వరూ మీకు సాయం చేయరు. అలాంటి చోట ఉండకూడదు. అదేవిధంగా పనిలేని ప్రదేశం. ఎలాంటి వారినైనా పనిలేని చోట అస్సలు ఉండకూడదు. అలాంటి చోట ఉండడం వల్ల లాభముండదు. పని లేకపోతే ధనముండదు. ధనం లేకపోతే జీవనం సాగించడం కష్టం అవుతుంది. ఎవరినైనా పనిలేని చోటులో జీవించకూడదు. ఇవన్నీ చాణక్య చెప్పిన విషయాలన్నింటిని పాటిస్తే మన జీవితం సుఖ, సంతోషాలతో గడపవచ్చు.
Also Read :
వర్షంలో అల్లు అర్హ ఆటలు.. వీడియో షేర్ చేసిన స్నేహారెడ్డి
అఖిల్ సినిమా విషయంలో ఆ తప్పు చేసి ఉండకుంటే సినిమా మరోలా ఉండేదంటున్న వినాయక్..!