రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా దానయ్య సినిమాను నిర్మించారు. అంతే కాకుండా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీమ్ ల కథ ఆధారంగా తెరకెక్కించారు.
Advertisement
ఇక ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటూ సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఎమోషన్స్ సన్నివేశాలు…యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Advertisement
జక్కన్న కెరీర్ లో ఇది మరో మాస్టర్ పీస్ అవ్వబోతుందని సినిమా విమర్శకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. అయితే నిజానికి మొదట ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ లను అనుకోలేదట. ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో వియేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…ముందుగా మల్టీ స్టారర్ చేయాలని అనుకున్నామని ఆ తరవాత కథను రాశామని చెప్పారు. చరణ్ ఎన్టీఆర్ లను హీరోలుగా అనుకుని కథను రాయలేదని చెప్పారు. ఇక కథ రాసిన తరవాత సినిమాలో రజినీకాంత్- అర్జున్ లను అనుకున్నామని చెప్పారు. అంతే కాకుండా సూర్య-కార్తీలను కూడా హీరోలుగా అనుకున్నామని అన్నారు. ఇక చివరగా చరణ్ ఎన్టీఆర్ లను ఫైనల్ చేశామని చెప్పారు.