ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి.. ఎంతోమంది నటీనటులు కనీసం 40 సంవత్సరాలు నిండకముందే మరణిస్తుండడం బాధాకరం.
Advertisement
కొంతమందేమో అనారోగ్య కారణాలవల్ల మరణిస్తే మరి కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ లేదా కెరియర్ ప్రాబ్లమ్స్ వల్ల మరణిస్తూ ఉన్నారు. అయితే చిన్న వయసులోనే చనిపోయిన స్టార్ హీరోలెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయ్ కిరణ్:
ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలో ఎదిగారో అంతే ఫాస్ట్ గా డల్ అయిపోయారు. ఆ తర్వాత అవకాశాలు లేక కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్లి కేవలం 33 ఏళ్లకే ఆ**త్య చేసుకొని మృతి చెందారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఏ విధంగా పేరు సంపాదించుకున్నారో, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఈయన కూడా 34 ఏళ్ల వయసులోనే మరణించారు..
యశోసాగర్ :
Advertisement
ఉల్లాసంగా ఉత్సాహంగా అనే మూవీతో ఒక్కసారిగా స్టార్ డం తెచ్చుకున్న యశోసాగర్. చిన్న వయసులోని రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం.
పునీత్ రాజ్ కుమార్ :
కన్నడ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. ఈ హీరోను అక్కడివారు అప్పు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అలాంటి ఈ హీరో హార్ట్ ఎటాక్ గురై కేవలం 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు..
తారకరత్న:
నందమూరి ఫ్యామిలీలో సౌమ్యడిగా పేరుపొందిన తారకరత్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిడదొక్కుకోలేకపోయారు. దీంతో రాజకీయాల్లోనైనా రానిద్దామని భావించి లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు విడిచారు. అలాంటి తారకరత్న వయసు 39 సంవత్సరాలు మాత్రమే.
also read: