సీఎం జగన్ తో సినీప్రముఖులు భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీనీ ప్రముఖులో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభాస్,మహేశ్ బాబు, చిరంజీవి, ఆలీ, రాజమౌళి,పోసాని, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ఇక ఈ సమావేశం అనంతరం హీరో మహేశ్ బాబు మీడియాతో మాట్లాడారు.
మొదటగా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నారు. ఆయన సినీపరిశ్రమలో సమస్య పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురయ్యాయని మహేశ్ బాబు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని వారం పది రోజుల్లోనే శుభవార్తను వింటారని మహేశ్ బాబు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ….త్వరలోనే చిత్ర పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని భావిస్తున్నట్టు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయం అందరినీ సంతోషపరిచిందని చెప్పారు. చిన్న సినిమాలకు ఐదు షోలు అనుమతించడం శుభ పరిణామం అంటూ తెలిపారు. చిన్న సినిమాలకు సీఎం మంచి వెసులు బాటు ఇచ్చారని చిరు వ్యాక్యానించారు. అంతే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమాల గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుందని అన్నారు.