జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. కడవరకు ఒకరికొకరు తోడుగా కలిసి ఉండేది భార్య భర్తలు మాత్రమే. కాబట్టి పెళ్లి చేసుకుంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది.
Advertisement
కానీ కొంతమంది స్టార్ హీరోయిన్ లు 40 దాటినా పెళ్లి చేసుకోకుండానే కాలం గడిపేస్తున్నారు. కారణాలు ఏవైనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ హీరోయిన్ లు ఎవరు…ఎందుకు ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నారు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం.
టబు
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన టబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. 48 ఏళ్లు వచ్చినా టబు పెళ్లి చేసుకోలేదు. అయితే గతంలో టబు నాగార్జున ను ప్రేమించిందని ఆ తరవాత నాగ్ అమలను పెళ్లి చేసుకోవడం తో టబు పూర్తిగా పెళ్లికి దూరంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
శోభన
Advertisement
శోభన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఇచ్చింది. ఆ తరవాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ రాణించింది. యాభై దాటినా శోభన పెళ్లి చేసుకోలేదు. ఓ పాపను దత్తత తీసుకుని జీవితాన్ని గడుపుతోంది.
నగ్మా
ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాలతార నగ్మా. క్రికెటర్ గంగూలీ తో, హీరో శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపిన నగ్మా పెళ్లికి మాత్రం దూరంగానే ఉన్నారు.
సితార
అందం అభినయం తో ప్రేక్షకులను అలరించిన సితార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. సితార 45 ఏళ్లు దాటినా పెల్లికి దూరంగా ఉంది. సహ నటుడు మురళితో ప్రేమ పెటాకులు అవ్వడం వల్లే సితార పెళ్లికి దూరంగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కౌసల్య
పంచదార చిలక సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ కౌసల్య. ప్రస్తుతం సినిమాలతో పాటూ సీరియల్స్ లోనూ నటిస్తోంది. కౌసల్య కూడా 40 దాటినా పెళ్లికి దూరంగానే ఉంది.
Also read :
ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ యొక్క వైఫ్స్!