సాధారణంగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించాలంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదు. అందం కూడా చాలా ముఖ్యమే. ప్రధానంగా హీరోయిన్స్ విషయంలో అందంగా ఉంటేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారు. అందుకే సినీ తారలు ఎప్పటికప్పుడూ డ్రెస్సింగ్ స్టైల్, రూపంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. తమ ముఖం మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపించేందుకు పలువురు ముద్దుగుమ్మ సర్జరీలు చేయించుకుంటున్నారు.
Advertisement
అందం కోసం సర్జరీ బాట పట్టిన వారిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకరు. మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆమె తన ముక్కుకు సర్జరీ చేయించుకుందట. ఈ విషయాన్ని తన ఆత్మకథ అన్ ఫినిష్డ్ లో రాసుకొచ్చింది. తన ముక్కు సర్జరీ ఫెయిల్ అయి.. తన ముఖం గుర్తు పట్టలేనంతగా.. మారిపోయిందని వెల్లడించింది. దీంతో ఆమె చాలా భయపడిపోయానని.. ఆ సమయంలో నిస్సహాయరాలిగా ఉండిపోయానని తెలిపింది. “ నా ముక్కుకు సర్జరీ చేసే సమయంలో డాక్టర్ ఆసక్తిని కోల్పోయాడు. దీంతో నా ముక్కు ఆకారమే మారిపోయింది. బ్యాండేజీ తొలగించగానే నా యొక్క ముక్కు చూసి అమ్మ, నేను భయపడిపోయాం. కాస్త వంకరగా మారిపోయి నా ముఖం మరోవిధంగా కనిపించింది.
Advertisement
అసలు నేను నాలాగే లేను. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. ఇక ఆ సమయంలోనే నేను నిస్సహాయురాలిగా ఉండిపోయాను. నా ఆత్మగౌరవం తగ్గిపోయినట్టు అయింది. తిరిగి మళ్లీ మామూలు మనిషి గా కోలుకుంటాను అనుకోలేదు” అంటూ రాసుకొచ్చింది ప్రియాంక చోప్రా. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలుత ప్రియాంక అందం కోసం సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వినిపించాయి. సర్జరీ సక్సెస్ కాకపోవడంతో అందవిహీనంగా మారిందని.. దీంతో తన ముక్కును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మళ్లీ సర్జరీలు చేయించుకుందట. కేవలం ప్రియాంక చోప్రా మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ కూడా ఇలాంటి సర్జరీనే చేయించుకుంది.
Also Read : 2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిన హనీరోజ్…ఆ సినిమా ఏదంటే…?