Telugu News » Blog » దిల్ రాజు రాజ‌కీయంపై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ఫైర్‌..!

దిల్ రాజు రాజ‌కీయంపై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ఫైర్‌..!

by Bunty
Ads

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం దిల్‌రాజు హ‌వా న‌డుస్తున్న‌ది. క‌రోనాకు ముందు నుంచే కాస్త స్లో అయిన‌ట్టు క‌నిపించినా.. రాజు ఇప్పుడు వ‌రుసగా పెద్ద కాంబినేష‌న్లు సెట్ చేస్తూనే మ‌రోవైపు వ‌రుస‌గా పెద్ద సినిమాల రైట్స్‌ను నైజాంతో పాటు ఉత్త‌రాంధ్ర‌లో కూడా ద‌క్కించుకుంటున్నారు నిర్మాత రాజు. ఈ త‌రుణంలోనే ఒకేసారి విడుద‌ల‌వుతున్న అన్నీ పెద్ద సినిమాల హ‌క్కుల‌ను ద‌క్కించుకుంటున్న రాజు కొన్ని సినిమాల విడుద‌ల తేదీల‌ను సైతం వాయిదా వేసుకునేలా చేస్తున్నార‌ని టాక్ ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది.

Advertisement

 

2022 సంక్రాంతికి ఎస్ఎస్ రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ తో పాటు, ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్- భీమ్లానాయ‌క్‌, మ‌హేష్ స‌ర్కారువారి పాట ముందుగా ఖ‌ర్చీఫ్ వేసుకున్నాయి. అయితే స‌ర్కారువారి పాట స‌మ్మ‌ర్‌కు వెళ్లిపోయింది. ఇక రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌ని ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక భీమ్లానాయ‌క్ కూడా ముందు నుంచే జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ కాస్త వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే ఈ మూడు సినిమాల‌ను కూడా నైజాంలో దిల్ రాజే పంపిణీ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు ఒకేసారి వ‌స్తే దిల్ రాజుకు దెబ్బ త‌ప్ప‌దు. దీనికి తోడు ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్టేశాడు. అప్పుడు అనుకున్న స్థాయిలో ఆ సినిమా అమౌంట్ రిక‌వ‌రీ కాదు. ఏటొచ్చి ఏమైనా దిల్‌రాజుకే భారీ న‌ష్టం త‌ప్ప‌దు. అందుకే కొద్ది రోజులుగా భీమ్లానాయ‌క్ సినిమాను వాయిదా వేయించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు భీమ్లా నాయ‌క్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 25కు వెళ్లేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు దిల్ రాజు.

Advertisement

 

Advertisement

ఇప్పుడు సంక్రాంతి పోటీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ వ‌ర్సెస్ రాధేశ్యామ్ మ‌ధ్యే ఉంటుంది. ఇక ఆ రోజు విడుద‌ల‌ కావాల్సిన ఎఫ్ 3 సినిమాను ఏప్రిల్ 29కు వాయిదా వేశారు. అది దిల్ రాజు సొంత సినిమా కావ‌డం విశేషం. ఇక ఈ సంక్రాంతి రేసు నుంచి త‌మ అభిమాన హీరో సినిమాను వాయిదా వేసేలా రాజు ఒత్తిడి చేయ‌డంతో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ దిల్‌రాజు తీరుపై మండి ప‌డుతున్నారు. అదే రాధే శ్యామ్‌ను వాయిదా వేయించ‌వ‌చ్చు క‌దా ? త‌మ సినిమాయే ఎందుకు వాయిదా వేయించారంటూ వారు ఫైర్ అవుతున్నారు. మ‌రీ చూడాలి ముందు ముందు ఇక ఏమి జ‌రుగుతుంద‌నేది..?