టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి సినిమాల కంటే వివాదాలతో నే ఎక్కువ పాపులర్ అయింది. కాస్టింగ్ కౌచ్ పై చేసిన రచ్చ తో శ్రీ రెడ్డి ఒక్కసారిగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖల పై ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం శ్రీ రెడ్డి యూట్యూబ్ లో కుకింగ్ వీడియోలు మరియు ఇతర వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా అప్పుడప్పుడు పొలిటికల్ అంశాల పై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇక శ్రీ రెడ్డి వైసీపీ కి సపోర్ట్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే.
Advertisement
తనకు సీఎం జగన్ అంటే చాలా అభిమానం అని అన్నా అంటూ సంబోధిస్తూ వీడియోలు చేస్తుంది. అయితే శ్రీ రెడ్డి రీసెంట్ గా ఓ వీడియో లో ఎమ్మెల్యే విడదల రజినికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల హర్ట్ అయ్యింది. అంతే కాకుండా ఎందుకు పదవి ఇచ్చవ్….ఆ కట్టూ బొట్టూ చూసి నువ్వు కూడా పడిపోయావా అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ విషయం పై తాజాగా శ్రీ రెడ్డి మరో వీడియో చేసింది.
Advertisement
వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ…..తాను ఏ పార్టీకి సపోర్ట్ చేయను అని చెప్పింది. తప్పు చేస్తే ఏ పార్టీని అయినా తిడతాను అంటూ చెప్పుకొచ్చింది. విడదల రజీనికి మంత్రి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదు అంటూ కామెంట్ చేసింది. విడదల రజినీ టిడిపి లో ఉన్నప్పుడు….పిల్లలకి రాక్షుసుడు ఎలా ఉంటాడో చూపించాలి అంతే జగనన్న ను చుపియ్యాలి అంటూ విమర్శించింది అని గుర్తు చేశారు.
అలాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ లు మంత్రి పదవులు ఇచ్చారని అది కూడా తక్కువ కాలం లోనే అంటూ ఫైర్ అయ్యింది. వైసీపీ లో ముందు నుండి ఎంతో కష్టపడి పని చేసిన సీనియర్ లకు ఇవ్వకుండా రజినీ కి, రోజా కు ఇచ్చారని వ్యాఖ్యానించింది. తాను కార్యకర్తల తరపున అడుగుతున్నా అని వాళ్లకు ఏం సమాధానం చెబుతారు అంటూ సీఎం జగన్ కి సూటిప్రశ్న వేసింది.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0kCzSWcpZUd6w1wEXdwBfCgGLhTmFXxbSgf43tKeA1UEkCchpTrcmXuozYpp3CfRyl&id=100044407510231