అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు మూవీ క్రిటిక్ అంటే తెలియదు. అలాంటి సమయంలో థియేటర్ల వద్ద, న్యూస్ ఛానల్స్ లో తాను సినిమా క్రిటిక్ అంటూ కత్తి మహేశ్ తనను తాను పరిచయం చేసుకున్నారు. జెన్యూన్ గా సినిమా రివ్యూలు ఇస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. సినిమా బాగుంటే లేదంటే లేదు అని ఎవరికి భయపకడకుండా రివ్యూలు చెబుతూ అతితక్కువ కాలంలో మంచి మూవీ క్రిటిక్ గా కత్తి మహేశ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
కానీ ఆ తరవాత పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలతో ఇతర కామెంట్లతో కత్తి మహేశ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అంతే కాకుండా కత్తి మహేశ్ నటుడిగానూ దర్శకుడిగానూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా కత్తిమహేశ్ రోడ్డు ప్రమాదం గాయపడి గతేడాది మృత్యవాత పడ్డారు. ఇదిలా ఉంటే కత్తిమహేశ్ మరణంపై నటి శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Advertisement
తన మిత్రులు ఇద్దరూ కత్తిమహేశ్ కంటే కొద్దిరోజుల క్రితం కరోనా తో మరనించారని ఆ షాక్ నుండి బయటపడక ముందే కత్తి మహేశ్ మరణవార్త వినాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. కత్తి మహేశ్ ఎప్పుడు చెన్నై వచ్చినా తనను కలిసేవాడని తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కత్తి మహేశ్ ను కలిసేదానినని శ్రీరెడ్డి తెలిపింది.
కత్తి మహేశ్ మంచి భోజన ప్రియుడు అని ఎప్పుడు కలిసినా హోటల్ కు వెళ్లి బాగా తినేవాళ్లం అని శ్రీరెడ్డి తెలిపింది. ఆయన మరణవార్త తనను క్రుంగదీసిందని చెప్పింది. కత్తి మహేశ్ మరణంపై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. యాక్సిడెంట్ నిజంగానే జరిగిందని కానీ ట్రీట్ మెంట్ విషయంలోనే ఏదో తేడా జరిగిందని శ్రీరెడ్డి అనుమానం వ్యక్తం చేసింది. ఓ మంచి స్నేహితుడుని తాను కోల్పోయానని శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యింది.