ఈనెల 26న ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ షురూ అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 17మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలెంజర్స్ వారియర్స్ అంటూ కొత్త వారిని పాతవారిని బిగ్ బాస్ రెండు గ్రూపులు చేశాడు. బిగ్ బాస్ ప్రారంభం అయ్యి రెండు రోజులు గుడుస్తుండగా ఇప్పటికే హౌస్ లో గొడవలు మొదలయ్యాయి. నామినేషన్ సందర్భంగా హౌస్ లో రచ్చ జరిగింది.
Advertisement
తనను బాడీ షేమింగ్ చేశాడంటూ నటరాజ్ మాస్టర్ ను ఆర్ జే చైతూ నామినేట్ చేశాడు. తమకు ఈ విషయం ముందే చెప్పాలని వారియర్స్ అంతా కలిసి ఆర్ జే చైతూను నామినేట్ చేశాడు. అంతే కాకుండా తనపై అనవరంగా నిందలు వేశాడని తను బాడీ షేమింగ్ చేయలేదని కేవలం ఫుడ్ తింటావా అని అడిగా అని నటరాజ్ మాస్టర్ ఏడ్చేశాడు. మరోవైపు ఆర్జే చైతూ చిన్నప్పటి నుండి తనకు బాడీ షేమింగ్ జరుగుతోంది.
Advertisement
ఇక్కడ కూడా తప్పడం లేదని బోరున ఏడ్చేశాడు. ఇక నామినేషన్ ల గురించి పక్కన పెడితే ముమైత్ ఖాన్ పై ఆర్జీవీ నాకిడ్ సినిమా బ్యూటీ శ్రీరాపాక సంచలన ఆరోపణలు చేసింది. గత మూడేళ్ల క్రితం ముమైత్ ఖాన్ తన చేయి విరగొట్టిందని తెలిపింది. ఆ విషయం చైతూ ఆర్జే కాజల్ లకు కూడా తెలుసని చెప్పింది. దానికి సంబంధించిన రిపోర్ట్ లు కూడా తన వద్ద ఉన్నాయని శ్రీరాపాక వెల్లడించింది.
also read : ప్రభాస్ “రాధేశ్యామ్” స్టోరీ లీక్….చివరి 20నిమిషాల కథ ఇదేనట…!
ఇదిలా ఉంటే ఆ విషయం మొత్తాన్ని తాను మర్చిపోయి హౌస్ లోకి వచ్చిన తరవాత ముమైత్ తో మాట్లాడితే ఆమె మాత్రం సరిగ్గా మాట్లాడటం లేదని చెప్పింది. అంతే కాకుండా తనపై లయర్ అంటూ కామెంట్స్ చేసిందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయం పై ముందు ముందు కూడా ఈ ఇద్దరు బోల్డ్ బ్యూటీల మధ్య యుద్దం జరిగే అవకాశం ఉంది.