మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా శ్రీజ, కళ్యాణ్ వేరువేరుగా ఉన్నట్లుగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, దాంతో శ్రీజ, కళ్యాణం దేవ్ వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలకు బలం చేకుర్చేలా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో గత ఏడాదికాలంగా కళ్యాణ్ ఫోటోలను షేర్ చేయలేదు. ఇక ఇటీవల వీరిద్దరూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటూ పోస్టులు చేశారు.
Advertisement
ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నామన్నది ముఖ్యమని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. దాని కౌంటర్ గా శ్రీజ ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్ళు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి, అని కామెంట్ చేసింది. దీంతో వీరు విడిపోతారని వార్తలు మళ్లీ వస్తున్నాయి. ఈ తరుణంలో కళ్యాణ్ దేవ్ పెళ్లి వేడుకల్లో కనిపించాడు. దాన్ని చూసి అందరూ కళ్యాణ్ దేవ్ రెండో వివాహం చేసుకున్నాడని భావించారు.
Also Read: ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!
కానీ తీరా చూస్తే… అది తన ఫ్రెండ్ మ్యారేజ్ అని తెలిసింది. సదరు వివాహానికి కళ్యాణ్ దేవ్ మిత్రులతో కలిసి హాజరై ఎంజాయ్ చేశాడు. మ్యారేజ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కళ్యాణ్ సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఆయన నటించిన మొదటి చిత్రం విజేత పరవాలేదనిపించింది. తర్వాత సూపర్ మచ్చి చిత్రంలో నటించారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఆశించినంతగా ఫలితం ఇవ్వలేదు.
READ ALSO : దారుణంగా మోసపోయిన తారకరత్న… నిర్మాతలు కూడా ముంచేశారు!