అలనాటి తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతిచిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. శ్రీదేవి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, తమిళ సినిమాలలో నటించి మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శ్రీదేవి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
Advertisement
ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆవిడ సినిమాలతో మన ముందు కనిపిస్తూనే ఉంటుంది. శ్రీదేవి మరణాన్ని చాలామంది అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక శ్రీదేవికి ఇండస్ట్రీలో రజనీకాంత్ మంచి ఫ్రెండ్. తనకు సంబంధించిన అన్ని విషయాలను రజనీకాంత్ తో షేర్ చేసుకునేది శ్రీదేవి. వీరిద్దరూ జంటగా చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి జోడి ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా పేరుని తెచ్చుకుంది. దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో 22 సినిమాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉండేది. శ్రీదేవి తల్లి తన కూతుర్ని వివాహం చేసుకోమని రజనీకాంత్ ను అడిగిందట.
Advertisement
దీంతో రజనీకాంత్ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది అలాంటివి ఏమీ లేవు అని చెప్పారట. దీంతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. అయితే ఒకానొక సమయంలో రజినీకాంత్ అధిక బరువు సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు సైతం తన ఆరోగ్య పరిస్థితిపై చేతులెత్తేశారు. దీంతో శ్రీదేవి… రజనీకాంత్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని, తాను ఎప్పటిలాగే మళ్లీ సినిమాల్లో నటించాలని పూణేలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేశారట. అంతేకాకుండా ఆరు రోజులు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారట. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య ఎంత చక్కటి స్నేహం ఉందో తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి
Virat Kohli : వరల్డ్ కప్ కోసం కోహ్లీకి డైమండ్ బ్యాట్..!
140 కిలోల బరువు.. తొలి బంతికే పరుగెత్తి రనౌట్ అయిన విండీస్ బాహుబలి..
సీఎం జగన్ ను తెలంగాణ వాళ్లు..రాళ్లతో తరిమి కొట్టారు – పవన్ కళ్యాణ్