Home » Sridevi : భర్త అప్పులను తీర్చడం కోసం మా ఊరిలో ఆస్తులన్నీ అమ్మింది.. శ్రీదేవి బాబాయ్ సంచలన వ్యాఖ్యలు..!

Sridevi : భర్త అప్పులను తీర్చడం కోసం మా ఊరిలో ఆస్తులన్నీ అమ్మింది.. శ్రీదేవి బాబాయ్ సంచలన వ్యాఖ్యలు..!

by Anji

అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. మంచి మనస్సుతో ఆమె నటిగా, అందంతో నిన్న, మొన్నటి తరం యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఆమె మరణించి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెను ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకునే ఉంటున్నారు అంటే ఆమె యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.  ఆమె చిన్నతనంలోనే సంపాదించడం ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా గడిపిన శ్రీదేవి తన తల్లికి కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఎంతో ఉపయోగపడింది.

ఇక హీరోయిన్ గా కెరీర్ కోసం ఆమె చాలా కష్టపడింది. అప్పుడు కూడా డబ్బు సంపాదించే మెషిన్ గా మారిపోయింది. తల్లి ఆరోగ్యం విషయంలో శ్రీదేవి ఒక పెద్ద పోరాటమే చేసింది. ఇక ఆ తరువాత తల్లి మరణించిన తరువాత చెల్లితో తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల కోసం కోర్టుకు ఎక్కింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆమె చనిపోయే వరకు కూడా కష్టాలను ఎదుర్కుంది. అత్తవారింట్లో సరైన స్థానం లేక, అక్కడ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఇక బోనీ కపూర్ కూడా ఆమెను ఉద్దరించింది ఏమి లేదు. సినిమాలు తీసి అప్పుల పాలైతే అతని అప్పులు తీర్చడం కోసం ఆమె తన సర్వస్వం దారపోసింది.

చివరికీ చెన్నై, హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను అమ్మి అతనికి ఇచ్చింది. శ్రీదేవికి పిన్ని భర్త ఇటీవలే ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి చిన్నతనం నుంచి అందరికీ బాగా సంపాదించి పెట్టిందని.. కానీ ఆమెకు మాత్రం మనశ్శాంతి లభించలేదని..తల్లి, చెల్లి, భర్త ఆమెను బ్రతికి ఉన్నంత వరకు పీక్కుతిన్నారని.. చివరికీ దుబాయ్ లో కూడా బోనీకపూర్ తో గొడవ జరిగి తన రూమ్ కి వెళ్లిపోయి మందు ఎక్కువ తీసుకుందట. పొరపాటున బాత్ టబ్ లో పడి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. బోనీ కపూర్ సంబంధించిన కుటుంబం శ్రీదేవి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా దగ్గరకు రానివ్వలేదని.. బోనీ మాత్రం అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వచ్చేవారని తెలిపారు. పిల్లలకు కూడా తెలుగు రాదని.. అందువల్ల తమతో కలవలేకపోతున్నారని చెప్పి బాధపడ్డారు శ్రీదేవి బాబాయ్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తరచూ మీ ఆలోచన తీరులో మార్పులు వస్తున్నాయా..? అయితే జాగ్రత్త వహించండి..!

ఉపాసనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..! ఇంతకీ ఏం జరిగిందంటే..!

Visitors Are Also Reading