కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటాయి. ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాయి. అలాంటి సినిమాల్లో అభినందన సినిమా కూడా ఒకటి. 1988 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కార్తీక్, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. చాలా సింపుల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.
Advertisement
ముఖ్యంగా సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా మంచు కురిసే వేళలో, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే పాటలు చార్ట్ బస్టర్లు గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ మొదట అతిలోక సుందరి శ్రీదేవి వద్దకు వచ్చింది. కథ నచ్చడంతో శ్రీదేవి కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథను ప్రముఖ నిర్మాత జి బాబు రాయగా సొంత నిర్మాణంలో చేయాలనుకున్నారు.
Advertisement
అంతే కాకుండా సినిమా కథ అనుకోగానే రచయిత ఆత్రేయ చేత సినిమా కోసం పాటలు రాయించారు. ఆత్రేయకు కథ ఎంతగానో నచ్చడంతో ఆయన సినిమాకు తగినట్టుగా పాటలను రెడీ చేశారు. ఆ తరవాత కథ రాసిన నిర్మాత జి.బాబు ఈ కథను మెగాస్టార్ చిరంజీవితో చేయాలనుకుని నిర్ణయించుకున్నారు. చిరంజీవి మేనేజర్ వద్దకు వెళ్లారు.
చిరంజీవి బిజీగా ఉండడంతో ఈ సినిమా గురించి చిరు మేనేజర్ తో మాట్లాడారు. అయితే చిరు మేనేజర్ ఇది ఒక రొటీన్ ప్రేమకథ అని చెప్పడంతో చిరంజీవి కూడా లైట్ తీసుకున్నారు. అలా చిరంజీవి నో చెప్పడంతో ముందుగా ఓకే చెప్పిన శ్రీదేవి కూడా ఈ సినిమాకు నో చెప్పారు. అలా శ్రీదేవి చిరంజీవి ఇద్దరు అభినందన లాంటి హిట్ సినిమా ను చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
మన స్టార్ హీరోయిన్లు వేసుకున్న టాటూలు, వాటి వెనుకున్న అర్థాలు అవేనా ?
ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ తన కెరీర్ పతనమవడానికి గల కారణాలు అవేనా ?