తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన కెరియర్లో చేయని పాత్ర అంటూ లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే విలక్షణ హీరో ఆయన. ఆయన సినీ జీవితంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రం శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ సినిమా వెనుక పెద్ద చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దామా.. నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించాడు. ఈ సంవత్సరంలో ఆయన శతజయంతి పూర్తి చేసుకోనున్నారు.
also read:లవ్ బ్రేకప్ అయ్యిందా..అయితే ఈ 4 విషయాల్లో జాగ్రత్త..4వది ఇంపార్టెంట్..?
దీంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు గత కొంతకాలంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఎన్టీఆర్ సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉండేవారు. అంతటి నిబద్ధత ఉంది కాబట్టి ఇంతటి పేరు వచ్చింది. ఆయన సినిమాల్లో నటించడమే కాదు దర్శకత్వం కూడా వహించి ఎన్నో హిట్లు అందుకున్నాడు. ఆయన కెరియర్ లో మైలురాయిగా నిలిచిన మూవీ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర.
also read:ప్రభాస్ మందు తాగితే అలా చేస్తాడా.. సీక్రెట్స్ బయటపెట్టిన గోపీచంద్..!!
1984లో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేమన, గౌతమ బుద్ధ, ఆదిశంకరాచార్య, రామానుజ,పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇలా ఐదు పాత్రలు చేశారు. ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత ఆయన కావడం విశేషం. అయితే ఈ సినిమా రిలీజ్ వెనుక పెద్ద కథ నడిచింది. 1981 లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ బోర్డు ఒక సీను కు అభ్యంతరం చెప్పింది. దీంతో అది కట్ చేయాలని చెప్పడంతో దీనికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. దీనివల్ల బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇక ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి మూడేళ్లు కొట్లాడి విజయం సాధించారు. ఆ తర్వాత 1984లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ విధంగా ఒక్క సీన్ కోసం సెన్సార్ బోర్డుకే చెమటలు పట్టించిన ఏకైక హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.
also read:శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయి ఇన్ని నెలలైనా పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా..?