ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలకు థియేటర్ లు ఉన్నాయి. అందులో మహేశ్ బాబు థియేటర్ టాప్ ప్లేస్ లో ఉంది. మహేశ్ బాబు గచ్చిబౌలిలో ఏఎంబీ పేరుతో భారీ ఏషియన్ మల్టీప్లెక్స్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రీసెంట్ గా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండకు కూడా మల్టీప్లెక్స్ ఉంది. అదే విధంగా హీరో వెంకటేష్, రానా లు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
Advertisement
ఇదిలా ఉంటే ఇప్పుడే కాదు ఒకప్పటి స్టార్ హీరోలు కొందరు కూడా థియేటర్ లను నిర్మించారు. అంతెందుకు నటసార్వభౌముడు ఎన్టీఆర్ సొంతంగా ఓ థియేటర్ ను నిర్మించుకున్నారు. ఈ థియేటర్ ను హైదరాబాద్ లో రెండున్నర ఎకరాల్లో ఎన్టీఆర్ ఎస్టేట్ లో నిర్మించారు. రాష్ట్రంలోనే మొదటిసారి 70ఎంఎం థియేటర్ ను కడుతున్నామని ఎన్టీఆర్ ప్రకటించారు.
Advertisement
ఎన్టీఆర్ 70ఎంఎం థియేటర్ ను కడుతున్నామని ప్రకటించగానే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని నటరాజ్ థియేటర్ ను ముందే 70ఎంఎం గా మార్చేశారు. ఎన్టీఆర్ రామకృష్ణ 70ఎంఎం మరియు 35ఎంఎం అనే పేర్లతో జంట థియేటర్ లను నిర్మించారు. అందులోనే షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా ఏర్పాటు చేశారు. థియేటర్ లకు రామకృష్ణ అని పేరు పెట్టడం వెనక ఒక కారణం కూడా ఉంది. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు అయిన రామృష్ణ పేరుతోనే ఈ థియేటర్ ను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఇది మొదటి ఎయిర్ కండిషనర్ థియేటర్ కావడం విశేషం. ఈ థియేటర్ ను ఎంతో కళాత్మకంగా ఎన్టీఆర్ అభిరుచికి తగ్గట్టుగా నిర్మించారు.
ఈ థియేటర్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్నో కలలు కని నిర్మించుకున్న ఈ థియేటర్ లు ఆయన మరణం తరవాత ప్రభావాన్ని కోల్పోయాయి. తెలుగుదేశం హయాంలోనే ఈ థియేటర్ లలో భూతు చిత్రాలు ప్రదర్శించడం విషాదకరం. కొంతకాలం తరవాత ఈ థియేటర్ ను మూసివేశారు. ఇటీవలి కాంలో ఇంద్ర సంస్థ వీటిని తిరిగి అభివృద్ది చేసింది. దాంతో ఈ థియేటర్ లకు పూర్వవైభవం వచ్చినట్టయ్యింది.