Home » ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని ఏడ్చేసిన రాఘవేంద్రరావు… అలాంటి పరిస్థితి ఆ స్టార్ దర్శకుడికి ఎందుకు వచ్చిందో తెలుసా..!

ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని ఏడ్చేసిన రాఘవేంద్రరావు… అలాంటి పరిస్థితి ఆ స్టార్ దర్శకుడికి ఎందుకు వచ్చిందో తెలుసా..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కాలంలో స్టార్ హీరో అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గురించి… స్టార్ డైరెక్టర్ అయినటువంటి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో 12 మూవీలు రూపొందాయి. అందులో 10 మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించగా… రెండు మూవీలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాయి. దీనిని బట్టి తెలుస్తుంది వీరిది ఏ రేంజ్ స్టార్ కాంబినేషన్ అనేది.

Advertisement

అలాగే వీరి కాంబినేషన్లో 12 సినిమాలు రూపొందాయి అంటేనే అర్థం అవుతుంది వీరి మధ్య బాండింగ్ ఏ రేంజ్ లో ఉంటుందా అని. ఇది ఇలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్… రాఘవేంద్రరావు కాంబినేషన్లో మొట్టమొదటి సినిమా అడవి రాముడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి రాఘవేంద్రరావుకు ప్రేక్షకుల నుండి… విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ దర్శకత్వం వహించే సమయానికి ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

Advertisement

దానితో రాఘవేంద్రరావుకు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో చాలా టెన్షన్ ఉండేదట. అంత గొప్ప స్టార్ హీరోకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో ప్రతి సన్నివేశాన్ని చాలా కష్టపడి రాసుకొని… అంతే కష్టంతో చిత్రీకరించేవాడట. ఈ మూవీలో పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. అందులో భాగంగా ఈ మూవీలోని “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు” అనే పాటలో ఎన్టీఆర్ ఏకంగా వాల్మీకి, శ్రీరాముడు, ఏకలవ్యుడు పాత్రల్లో కనిపించాడు.

ఈ మూవీలోని ఈ సాంగ్లో శ్రీరాముడు పాత్రలో ఎన్టీఆర్ గారు నటిస్తుంటే శ‌బ‌రి పాత్రలో ఉన్న ఆమె శ్రీరాముడిని తలెత్తి పైకి చూడకూడదు … కేవలం శ్రీరాముడి పడాలనే చూడాలి. అయితే ఈ మూవీలోని ఈ సన్నివేశాన్ని రాఘవేంద్ర రావు స్వయంగా ఆమెకు చేసి చూపిస్తానని చెప్పి శ‌బరి పాత్రను చేసి చూపించాడట. ఆ సన్నివేశంలో భాగంగానే రాఘవేంద్ర‌ రావు సీనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టాడట.

Visitors Are Also Reading