జీవితంలో అన్నింటిలో కెల్లా ఘనమైనది వివాహం. అప్పటి వరకూ ఒకవిధంగా ఉన్న జీవితం పెళ్లితో పూర్తిగా మారిపోతుంది. కొత్త ఆలోచనలు ఆశలు..సరికొత్త బంధాలతో జీవితం ప్రారంభం అవుతుంది. కాబట్టి వివాహానికి సంబంధించిన ఏ గుర్తులు అయినా ఎంతో ప్రత్యేకం. ఇక పెళ్లికి ముందు లగ్నపత్రికలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా…లగ్నపత్రికలు మాత్రం పంచాల్సిందే. ఒకప్పుడు సాధాసీదాగా ఉన్న లగ్నపత్రికల్లో ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లు వచ్చాయి. అయితే తాజాగా ఒకప్పటి పెళ్లిపత్రిక ఇప్పడు వైరల్ అవుతోంది.
Advertisement
ఆ పత్రిక కూడా మరెవరిదో కాదు….అన్నగారు ఎన్టీరామారావు బసవతారకంల వివాహ ఆహ్వానపత్రిక. ఈ పత్రికలోని తెలుగు భాషా పదాలు కూడా కాస్త గ్రాంథిక భాషలో కనిపిస్తున్నాయి. కొమురవోలు అనే గ్రామంలో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పత్రికను గుడివాడలోని శ్రీ బాలసరస్వతి ప్రెస్ లో ముద్రించినట్టు కనిపిస్తోంది. ఇక 22-04- 1942లో ఎన్టీరామారావు తన సొంత మరదలు అయిన బసవతారకం ను వివాహం చేసుకున్నారు.
Also read: NTR నిర్మాతలు వద్దంటున్నాశ్రీదేవి విషయంలో NTR ఎందుకు అలా చేసారు ?
Advertisement
అప్పట్లో వీరిని అన్యోన్య దంపతులుగా కొలిచేవారు.1985లో బసవతారకం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య గుర్తుగా అన్నగారు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ రోగులకు చికిత్సను అందిస్తున్నారు. అంతే కాకుండా విదేశాలలో ఉండే టెక్నాలజీతో ఈ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. తక్కువ ధరకే మందులు ఇస్తూ మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడకుండా సహాయం చేస్తున్నారు.
Also Read: ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ఫోటో గ్యాలరీ ..!