సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు అంటే ఒక బ్రాండ్. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఎన్టీఆర్ అభిమానులను సంపాదించుకున్నారు. సాంఘిక, రాజకీయ, పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో వినోదంతో పాటు మెసేజ్ కూడా ఉండటంవల్ల చాలామంది ఎన్టీఆర్ సినిమాలను ఇష్టపడేవారు. ఎన్టీఆర్ చాలా విషయాలలో ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా ఉండేవారు.
Advertisement
అలంకరణ విషయంలో అయినా క్రమశిక్షణ విషయంలో అయినా ఆహారపు అలవాట్ల విషయంలో ఆయినా ఇలా ప్రతి విషయంలోనూ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకత ఉండేది. ఇక ఎన్టీఆర్ ను ఆయన పేరుతో ఎవరు పిలిచేవారు కాదు. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఎన్టీఆర్ ను పిలుస్తుండేవారు. తాపీనేని రామారావు గారు ఎన్టీఆర్ ను…. రామారావు గారు అని సంబోధించేవారు.
Advertisement
అంతేకాకుండా కమలాకర కామేశ్వర రావు ఎన్టీఆర్ ను ఫన్నీగా దొంగ రాముడు అని పిలుచుకునేవారు. ఇక చాలామంది ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచేవారు. ఈ పేరు వెనుక కూడా ఒక కథ ఉంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచిన వ్యక్తి దాసరి నారాయణరావు. దాసరిగారే ఎన్టీఆర్ కు అన్నగారు అని పేరు పెట్టారు.
దాసరి నారాయణరావు ఎక్కువగా తన స్పీచ్ లలో అన్నగారు అని పిలవడంతో….అదే పేరు ఆ తర్వాత చాలామందికి అలవాటైపోయింది. పత్రికల్లో మీడియాలో కూడా ఎన్టీఆర్ ను అన్నగారు అని సంబోధించడం మొదలయ్యింది. మరోవైపు ఎన్టీ రామారావు కూడా తన రాజకీయ ఉపన్యాసాల్లో తెలుగు తమ్మళ్లు… అక్క చెల్లెలు అని పిలిచేవారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బ్రదర్ అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు.