తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందంటే దాని వెనుక సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో కొంత తప్పనిసరిగా ఉందని చెప్పవచ్చు. నటన అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నటన అనే విధంగా తెలుగు సినిమాల్లో ఆయన చేయని పాత్రలు లేవు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే ఎన్టీఆర్ తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సినిమా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.
Advertisement
అలాంటి ఎన్టీఆర్ అప్పట్లో నటన అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. తోటి నటీనటులను ఎప్పుడైనా పేరుతో కాకుండా ఏదో ఒక బంధంతో పిలిచేవారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తన అమ్మ తర్వాత మరో వ్యక్తిని అమ్మ అని కడుపారా పిలిచేవారట. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండస్ట్రీలో మొదటి తరం హీరోయిన్ గా అలరించిన పుండరీబాయిని ఎన్టీఆర్ అమ్మ అని పిలిచేవారు.
Advertisement
ఎవరికైనా సరే ఆమెను చూస్తే అమ్మా అని పిలవాలనిపించే అంత నిండుగా చీర కట్టుకొని కనిపించేవారట. పాతాళభైరవి, గజదొంగ వంటి సూపర్ హిట్స్ తో దాదాపు 30 సినిమాలకు పైగా ఎన్టీఆర్ కి తల్లిగా చేసిన పుండరీ బాయ్ ని కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎప్పుడు అమ్మ అనే సంభోదించేవారని ఆయన సన్నిహితులు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- తెలుగులో అక్కినేనికి తొలి ద్విపాత్రాభినయం సినిమా ఏదో తెలుసా ?
- ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం
- వేణుమాధవ్, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?