ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు ఆరోగ్యంగా ఉండడానికి ఇంటి చిట్కాలు ని పాటిస్తూ ఉంటారు. అలానే రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. వేగంగా నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. రోజు పదివేల అడుగులు నడవడం వలన గుండె సంబంధిత సమస్యలు ఉండవు అకాల మరణం ముప్పు కూడా తగ్గుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. వాకింగ్ చేయడం వలన ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. నరాల పనితీరు కూడా బాగుంటుంది. వేగంగా నడిస్తే మెదడు పని తీరుపై అనుకూల ప్రభావం కనబడుతుంది. మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, నిద్రకి కూడా వేగంగా నడవడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి.
Advertisement
గంటకి మూడు నుండి ఐదు కిలోమీటర్లు సగటునడక వేగం నెమ్మదిగా నడవడం కంటే కూడా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని స్టడీ చెప్తోంది. నడక కంటే కూడా వేగంగా నడవడం వలన చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. గుండె సమస్యలు మొదలు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వేగంగా నడవడం వలన తగ్గిపోతాయి. రోజు 10,000 అడుగులు నడిస్తే గుండె సంబంధిత సమస్యలు తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. బీపీ, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతాయి, ఇలా వాకింగ్ వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
Advertisement
స్పీడ్ గా నడవడం వలన కండరాల బలాన్ని పెంచుకోవచ్చు గుండె రక్తనాళాల పై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది వేగంగా నడిచే అలవాటు ఉంటే బరువు కంట్రోల్ లో ఉంటుంది. వేగంగా నడిస్తే గుండెకి బాగా రక్తప్రసరణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా నడవడం, వ్యాయమ పద్ధతుల్ని పాటించడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం చాలా అవసరం. అలానే సరిపడా నీళ్లు తాగడం, సరిపడ నిద్రపోవడం కూడా ముఖ్యం రోజు ఒకే టైం కి లేచి ఒకే టైం కి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!