టాలీవుడ్ లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబర్ 25న కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా ఆయన స్వరంతో పాడిన వేలాది పాటలు ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. కేవలం సింగర్ గానే కాకుండా ఎస్పీ బాల సుబ్రమణ్యం నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించారు. చివరగా ఆయన ప్రధాన పాత్రలో మిథునం అనే సినిమాలో నటించారు.
Advertisement
మొదట శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో పాటలు పాడి ఎస్పీ బాలు గాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన పాడిన పాటలకు గుర్తింపు రావడంతో వరుస ఆఫర్ లు అందుకున్నారు. దాదాపు స్టార్ హీరోలు అందరి సినిమాలలోనూ ఆయన పాటలు పాడారు. తెలుగు తో ఆటూ తమిళ హిందీ కన్నడ భాషలలో కలిపి దాదాపు 40 వేలకు పైగానే పాటలు పాడారు. మాస్ క్లాస్ పాటలతో పాటూ భక్తిరస పాటలను పాడారు.
అంతేకాకుండా కొందరు హీరోలకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు. దాంతోపాటు సింగింగ్ రియాలిటీ షో లకు సైతం ఎస్పీ బాలు జడ్జిగా వ్యవహరించారు. ఎంతోమంది యువ గాయకులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. బాలసుబ్రమణ్యం గారికి సంబంధించిన సినిమా ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోలు మరియు ఆయన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఎస్పీ బాలు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే…. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి భార్య పేరు సావిత్రి. కాగా వీరికి ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు.
ఎస్పీ బాలు కుమారుడు చరణ్ కూడా సింగర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అంతేకాకుండా చరణ్ సింగింగ్ రియాలిటీ షోకు హోస్ట్ గా చేస్తున్నారు. మరోవైపు ఎస్పీ బాలు సోదరి పి. సుశీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
మరికొన్ని వార్తలు :
Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?