టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ లలో వివి వినాయక్ ఒకరు. వినాయక్ మొదటి సినిమానే నందమూరి హీరో ఎన్టీఆర్ తో ఆది సినిమా తీసి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. దాంతో వినాయక్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ వెంటనే బాలయ్య వినాయక్ కు అవకాశం ఇచ్చాడు. దాంతో వినాయక్ బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య చెప్పే డైలాగులు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి.
Advertisement
అంతే కాకుండా సినిమాలో సుమోలు భూమిలో నుండి రావడాలు…గాల్లో పల్టీలు కొడ్డడాలు లాంటి సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో బాలయ్య డబుల్ యాక్షన్ తో అదరగొట్టారు. అంతే కాకుండా సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీయ, టబు హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయినా ఫ్యాన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది.
Advertisement
కాగా తాజాగా రీసెంట్ ఇంటర్వ్యూలో దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిర్మాత బెల్లకొండ సురేష్ ద్వారా ఈ సినిమా కోసం బాలయ్యను సంప్రదించానని చెప్పారు. బాలయ్య కథ విని ఓకే చెప్పారని అన్నారు. పెద్దహీరోను హ్యాండిల్ చేయగలనా…ఎలాగైనా బాలయ్యను ఓ రేంజ్ లో చూపించాలి అనే పిచ్చిలో సినిమా కథపై ఫోకస్ తగ్గిందేమో అనిపించిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో టబు చేసిన పాత్ర కోసం ముందుగా సౌందర్యను అనుకున్నామని చెప్పారు.
బెంగుళూరు వెళ్లి సౌందర్యకు కథ చెప్పగా అప్పుడే ఓల్డ్ పాత్రలు చేయను వియన్ అంటూ సౌందర్య సమాధానం ఇచ్చారట. ఇప్పుడే ఓల్డ్ పాత్రలు చేస్తే తరవాత అవకాశాలు అన్నీ అవే వస్తాయి అని చెప్పారట. వినాయక్ సౌందర్య హీరోయిన్ గా నటించిన ఐదారు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆ చనువుతోనే చెన్నకేశరరెడ్డి సినిమాలో నటించడానకి సంప్రదించారట. ఇక సౌందర్య రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రలో టబు నటించిన సంగతి తెలిసిందే.